Connect with us

Leadership

Los Angeles: సుధీర్ పొత్తూరి & సురేష్ అంబటి సారధ్యంలో కొలువుదీరిన LATA నూతన కార్యవర్గం & డైరెక్టర్ మండలి

Published

on

Los Angeles, California: సుధీర్ పొత్తూరి మరియు సురేష్ బాబు అంబటి నాయకత్వంలో ఏర్పడిన లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ “లాటా” నూతన కార్యవర్గం మరియు డైరెక్టర్ మండలి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం స్థానిక షిర్డీ సాయిబాబా మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు వారు, స్వచ్ఛంద సేవకులు మరియు మిత్రులు హాజరై శుభాభినందనలు తెలియజేశారు.

లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ (Los Angeles Telugu Association – LATA) స్వచ్ఛంధ సేవకులే ప్రముఖులుగా నిర్వహించబడుతున్న సంస్థ అని కార్యవర్గం తెలియచేసింది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు మరియు సాంకేతిక శిక్షణ తరగతులను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకువెళతామని తెలిపారు. తెలుగు వారికిఎవరికైనా ప్రత్యేక సహాయం కావలసినవారు లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గాన్ని సంప్రదించగలరు.

త్వరలో నిర్వహించనున్న లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ (Los Angeles Telugu Association – LATA) సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యోన్ముఖులమయ్యామని, తెలుగువారందరు మనసును రంజిపచేసే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని, ఇదే ప్రత్యేక ఆహ్వానం అని లాస్ ఏంజెల్స్ (Los Angeles) తెలుగు అసోసియేషన్ కార్యనిర్వాహకులు తెలిపారు.

లాటా నూతన కార్యవర్గం
అధ్యక్షులు: సుధీర్ పొత్తూరి
ఉపాధ్యక్షులు: చంద్రశేఖర్ గుత్తికొండ
కార్యదర్శి: శ్రీకాంత్ వల్లభనేని
సంయుక్త కార్యదర్శి: విష్ణు యలమంచి
కోశాధికారి: సూర్య భమిడిపాటి
సంయుక్త కోశాధికారి: సుధా రాణి దావులూరి
సభ్యులు: అరుణ మధ్యానమ్, పృథ్వీష్ కాసుల

లాటా డైరెక్టర్ మండలి
చైర్మన్: సురేష్ బాబు అంబటి
సభ్యులు: అలేఖ్య గరికపర్తి, భార్గవి దేవిడి, హరిబాబు నేతి, నరేంద్ర కవర్తపు, ప్రతాప్ మేథరమిట్ట, ప్రతాప్ చెరుకూరి, శ్రీకాంత్ అమినేని, సునీల్ కుమార్ మల్లెల, ఉమ కాట్రు వెంకట క్రిష్ణ బోసం మరియు వెంకట పూసర్ల.

error: NRI2NRI.COM copyright content is protected