Connect with us

Events

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు YVB రాజేంద్రప్రసాద్ తో బోస్టన్లో మీట్ & గ్రీట్ విజయవంతం

Published

on

అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ మహానగరంలో ఎన్నారై టిడిపి (Boston NRI TDP) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు రాజేంద్రప్రసాద్ (Yalamanchili Venkata Babu Rajendra Prasad) తో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

బోస్టన్ నగరంలో మే నెలలో జరిగిన మహానాడు (Mahanadu) కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించినందుకు ఎన్నారై టిడిపి నాయకులందరినీ అభినందించి, ఇదే స్ఫూర్తితో అమెరికాలోని పలు నగరాలలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎన్నారై టిడిపి నాయకులకు పిలుపునిచ్చారు రాజేంద్రప్రసాద్.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు (NTR) గారి శత జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనో లేక అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారు కూడా ఘనంగా జరుపుకోవాలని, ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు సినీ రంగంలో నెంబర్ 1 గా రాణించడమే గాక, తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పేదవానికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో సుపరిపాలన అందించారన్నారు.

అలాగే తెలుగువాడి ఖ్యాతిని దేశ నలుమూలల చాటి చెప్పి, మన ఆత్మ గౌరవాన్ని నిలిపిన ఘనుడు ఎన్టీఆర్ గారని, అలాంటి మహానుభావుని శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో అమెరికాలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఎన్నారై టిడిపి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు నన్నపనేని మోహన్ గారు, శ్రీనివాస్ గొంది గారు, సుధాకర్ తురగా గారు, అంకినీడు ప్రసాద్ రావి గారు, శ్రీ బోల్ల గారు, సూర్య తేలప్రోలు గారు, అనిల్ పొట్లూరి గారు, చంద్ర వల్లూరు పల్లి గారు, సురేష్ దగ్గుబాటి గారు, కోటేశ్వరరావు కందుకూరి గారు, సురేష్ కమ్మ గారు, రావి వేదల గారు, గోపి నెక్కలపూడి గారు, శరత్ బేతపూడి గారు, బద్రి గుడివాడ గారు, శ్రీకాంత్ చేబ్రోలు గారు, రాజేష్ కాపు గారు, హేమాద్రి లెక్కల గారు, రావుల శ్రీనాథ్ గారు, పద్మ కందుకూరి గారు, శిరీష గొంది గారు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected