Connect with us

Education

అక్షరాల పండుగకి శ్రీకారం: తానా “పుస్తక మహోద్యమం”

Published

on

అక్టోబర్ 21, 2021: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన పుస్తక మహోద్యమాన్ని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఈరోజు పలువురు స్నేహితులకు వివిధ పుస్తకాలను బహుమతులుగా అందజేసి అట్లాంటా నగరంలో లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక సంక్రాంతి ఈవెంట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీనివాస్ లావు, దక్షిణ తూర్పు ప్రాంతీయ కార్యదర్శి వెంకట్ మీసాల, ఫౌండేషన్ ట్రస్టీస్ కిరణ్ గోగినేని మరియు వినయ్ మద్దినేని అలాగే తానా సభ్యులు బాలనారాయణ మద్ద, చైతన్య తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలను కొని మిత్రులకు, బంధువులకు, పిల్లలకు బహుమతులుగా అందించే అక్షరాల పండుగ అని, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ బృహత్ యజ్ఞంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

డాలస్ నగరంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి కి ప్రముఖ సినీగీత రచయిత, తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన “శ్రీ నైమిశ వేంకటేశ శతకం” ను బహుమతిగా అందజేసి పుస్తక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “తెలుగు సాహిత్య చరిత్రలో ఈ పుస్తక మహోద్యమం ఒక అపూర్వ అధ్యాయం అని ఎవరు ఎన్ని పుస్తకాలనైనా, ఏ పుస్తకాలనైనా, ఎక్కడైనా కొనుగోలు చేసి, ఎంతమందికైనా, ఏ ఊరిలోనైనా బహుకరించవచ్చని తెలియజేశారు. ఏ సందర్భంలోనైనా సరే తమకు ఇష్టమైన పుస్తకాలను కొనుగోలుచేసి ఆత్మీయులకు బహుమతులుగా అందజేసే అలవాటును ప్రోత్సహించడం, కనీసం పాతిక వేల పుస్తకాలను పాఠకుల చేతుల్లోకి తీసుకువెళ్ళే లక్ష్యంగా సాగుతున్నామని, అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రం, భద్రాచలంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ పుస్తక మహోద్యమానికి అనేక సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, రచయితలు, పాఠకుల నుండి తొలినుంచే విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమం వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఒక ఉద్యమంగా సాగుతుందని, అందరూ పాల్గొని ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయమని కోరారు. మీరు బహుకరిస్తున్నప్పుడు తీసిన ఫోటోలను, కొన్ని వివరాలను ఈ క్రింది లంకెలో పొందుపరచినట్లితే మీ ఫోటోలను తానా వెబ్సైటులో నిక్షిప్తం చేసి, తానా సంస్థ ద్వారా మీకు “పుస్తక నేస్తం” అనే ప్రశంసాపత్రం అందజేయబడుతుంది.

https://bit.ly/TANAPUSTAKAMAHODHYAMAMREG

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected