తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అమెరికాలోని పలు నగరాలలో బోనాలు, అలయ్ బలయ్ మరియు పోతరాజు జాతర నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. గత వారాంతం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అమెరికా అంతటా వ్యాపించేలా శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) అడ్వైజరి కౌన్సిల్ మెంబర్ భరత్ రెడ్డి మాదాడి (Bharath Reddy Madadi) పర్యవేక్షణలో జులై 15న స్థానిక కమ్మింగ్ నగరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి గుడిలో బోనాలు మరియు అలయ్ బలయ్ నిర్వహించారు.
అట్లాంటా (Atlanta) మహిళలంతా వేడుకగా వచ్చి మహంకాళి తల్లికి బోనాలు (Bonalu) సమర్పించారు.ఆహ్లాదకరమైన వాతావరంల్లో సుమారు వెయ్యి మంది భక్తులు వెంటరాగా అమ్మవారు పోతరాజు తో కలిసి ఊరేగింపుగా వచ్చారు.
భక్తులు బోనం సమర్పించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు.సంబరాలలో పాల్గొన ప్రతి ఒక్కరికి టిటిఎ అట్లాంటా చాప్టర్ (TTA Atlanta Chapter) కార్యవర్గ సభ్యలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, అలయ్ బలయ్ నిర్వహించారు.
ఆహ్వానితులందరికీ పండుగ ప్రత్యేక భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో TTA అడ్వైజరీ కమిటీ మెంబర్ భరత్ రెడ్డి మాదాడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వెంకట్ గడ్డం, స్వాతి చెన్నూరి, కార్తీక్ నిమ్మల, రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ త్రిలోక్ గుంటుక, సుధీర్ కొత్త, కల్చరల్ టీం తదితరులు పాల్గొన్నారు.