న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో జులై 28 వ తేదీన బెల్మంట్ లేక్ స్టేట్ పార్క్, న్యూయార్క్ (New York) లో బోనాల జాతరను అబ్బురపరిచే రీతిలో నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ (Vani Singirikonda) మాట్లాడుతూ… తెలంగాణలో ప్రత్యేకంగా అమ్మవారిని పూజించే బోనాలు జాతరను నైటా అద్వరైంలొ మొట్టమొదటి సారిగా అమెరికాలో మెదలు పెట్టి గత 3 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా జరుపుతున్నది.
అదేవిధంగా ఈ సంవత్సరం నైటా (NYTTA) కార్యవర్గం ఇంకా ఎంతో వైవిద్యంగా నిర్వహించడానికి ముందుకొస్తున్నది. ప్రత్యేకమైన బోనంతో న్యూయార్క్ (New York) లోని మహిళలు అందరు ముస్తాబై, పిల్లల ఆట పాటలతో కొలహాహలంగా జరుపుకోడానికి సంసిద్ధముతున్నది. ఈ సందర్బంగా బోనాలతోపాటు పలు ఆట పాటలు, పెయింటింగ్, ఐస్ క్రీం, మంచి తెలంగాణ విందు (Telangana Festive Dinner) ఎర్పాటు చేయటం జరుగుతుంది.
నైటా (New York Telangana Telugu Association) వారు జరిపే బోనాల జాతరకి వందలాదిగా తరలి వచ్చి తెలంగాణ (Telangana) పండుగని దిగ్విజయం చేయవలిసిందిగా న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ప్రసిడెంట్ వాణి సింగిరికొండ మరియు నైటా (NYTTA) కార్యవర్గం కోరుతున్నారు.