Delaware, US: అమెరికాలో, Delaware రాష్ట్రంలో తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘము (TTA) ఆధ్వర్యంలో బోనాలు చాలా వైభవంగా జరిగాయి. ఈ శనివారం జులై 15న Delaware లో తెలంగాణ (Telangana) నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో బోనాల పండుగను జరుపుకున్నారు.
దాదాపుగా వెయ్యి మంది పైగా తెలంగాణ ప్రజలు ఒక చోట కలుసుకుని పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన TTA సంఘం తెలిపింది. Delaware రాష్ట్రంలో మొదటి బోనాల పండుగనే ఇంత వైభవంగా జరిగినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు సంఘ సభ్యులు.
మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో వేడుకలకు తరలిరావడం, పోతురాజు నృత్యం, వేణు బృందం డప్పుల సంబరాల నడుమ పండుగ శోభాయమానంగా జరిగింది. ఇక నుండి ప్రతి యేటా బోనాల పండుగను ఇంతే ఘనంగా జరుపుతామని TTA సంఘము ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ బోనాల వేడుకులకు విచ్చేసిన భక్తులకు TTA సభ్యులు రుచికరమైన తెలంగాణ వంటకాలతో విందును ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసినవారిలో మహిళా సభ్యులు, కోర్ కమిటీ సభ్యులు మరియు వాలంటీర్లు ఉన్నారు.
శ్వేత పిన్న, శృతి మేడిశెట్టి, కార్తి చిట్టి, దీప్తి రేపాల, సౌజన్య కొలిపాక, షాలిని, రితిక, స్వాతి, యశ్విని మరియు ఆర్గనైజర్స్ భాస్కర్ పిన్న, నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, ప్రదీప్ రెడ్డి, వేణు ఎనుగుల, శివ రెడ్డి, మహేష్ మర్రి, ప్రానేష్ కొట్టం, విశాల్, కిరణ్ మేడిశెట్టి, రమ, రవీందర్, నగేష్, రమణ కొత్త, మహేష్ సంబు, పవన్, జనార్దన్, ప్రతీక్, భరత్, గ్రేటర్ ఫిల్లీ కోర్ కమిటీ సభ్యులకు స్వతంత్రంగా వేడుకలలో పెద్ద ఎత్తున పాల్గొన్న వాలంటీర్లకు తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘము ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేసింది.