విశ్వవిఖ్యాత, నట సార్వభౌముడు, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు గారు, ఈ భూమి మీద లేకపోయినా, తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు.
ఆయనను ప్రతి ఒక్క తెలుగువాడు స్మరిస్తూ, 19th జనవరి, 2024 శుక్రవారం, యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ ఆధ్వర్యంలో అక్కిలి నాగేంద్ర బాబు అధ్యక్షతన, కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమము నిర్వహించడం జరిగినది.
యన్.టి.ఆర్. ట్రస్ట్ వారి సౌజన్యంతో, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చన్నాయుడు గారు, యబ్.ఆర్.ఐ. టిడిపి ఛైర్మన్ రవి వేమూరు గారు, యన్.ఆర్.ఐ. టిడిపి గల్ఫ్ అధ్యక్షులు రావి రాధాక్రిష్ణ గార్ల ఆదేశాలు, సూచనలు, సలహాలు ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు రక్త దానం చేశారు. అందరికీ సర్టిఫికెట్స్ అందించారు.