అట్లాంటా మెగాస్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్టు 21న రక్తదాన శిబిరం, 22న సంగీత విభావరితో అట్లాంటా హోరెత్తింది. కుండపోత వానలో కూడా వెరవక రక్తదాన శిబిరంలో విరివిగా పాల్గొన్న వారిని అభినందించాలి. లైఫ్ సౌత్ ఆర్గనైజేషన్ వారు చిరంజీవి గురించి వివరాలు తెలుసుకోవడం విశేషం. సంగీత విభావరిని క్వాలిటీ సిస్టమ్స్ ఎన్హాన్సమెంట్స్, అనిల్ బోదిరెడ్డి ప్రొడక్షన్స్, వెంకట్ గోక్యాడ, వెంకట్ ఐనాబత్తిన మరియు నార్తీస్ట్ మోర్ట్గేజ్ చిన్మయ మంచల సమర్పించగా, బీట్స్ & ఈవెంట్స్ వారు డీజే, అలాగే ది థర్డ్ ఐసి రఘు విడియో చిత్రీకరణ చేసారు. కమ్మింగ్ నగరంలోని స్థానిక సెక్సటన్ హాల్లో నిర్వహించిన ఈ మెగా వేడుకలలో సుమారు 200 మంది పాల్గొన్నారు.
ప్రముఖ గాయనీ గాయకులు వెంకట్ చెన్నుభొట్ల, శిల్ప, అర్చనారెడ్డి, వాహిని తమ పాటలతో మరియు డీజే సిద్దు మెగాభిమానులని ఉర్రూతలూగించారు. ఉత్తర అమెరికాలో తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు విశిష్ఠ సేవలందిస్తున్న నేషనల్ ఆర్గనైజేషన్ లను ని గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. తానా, ఆటా, నాటా, టాటా మరియు సిలికానాంధ్ర నేషనల్ లీడర్స్ ని పెద్దలు ఉదయ్ భాస్కర్ కొట్టే మరియు గోపాల్ గూడపాటి చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. అలాగే స్పాన్సర్స్ ని మెగా ఫ్యాన్స్ ఆఫ్ అట్లాంటా కార్యవర్గ సభ్యులు వెంకట్ మీసాల, సురేష్ కరోతు, రవి ఎలిసెట్టి, కృష్ణ మేకల, వెంకట్ గొక్యాడ, రాఘవ, నరేష్ శ్రీరామ మరియు రామకృష్ణ వేల్పూరి చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. అతిథులు గోపాల్ గూడపాటి, సత్య బళ్ళ మరియు కిరణ్ వడ్లాని గాయనీ గాయకులను సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించిన ఎన్నారై2ఎన్నారై.కామ్ వారికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. గడిచిన పది రోజులుగా ప్రతి రోజూ ఒక ట్రివియా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన మెగాభిమానులకు గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మెగా హిట్స్ కి అడుగులో అడుగులు కలుపుతూ ఆడపడుచులు, చిన్నారులు డాన్స్ చెయ్యడం అందరిని ఉత్తేజపరిచింది. సాయంత్రం తేనీటి విందు, రాత్రికి చక్కటి డిన్నర్ బాక్సుల్లో కాకతీయ రెస్టారెంట్ నుండి అందించిన ఫుడ్ రుచికరంగా ఉంది. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన మెగాభిమానులకు, స్పాన్సర్స్ మరియు గడిచిన వారం రోజులుగా ఈవెంట్ మెగా సక్సెస్ లో తమ పాత్ర పోషించిన అభిమానులకు వెంకట్ గోక్యాడ చక్కటి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది.