Connect with us

News

New York టైమ్స్ స్క్వేర్ లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

Published

on

అభిమానం చాటుకున్న ప్రవాస భారతీయులు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అమెరికాలో అట్లాంటాకు వచ్చిన సందర్బముగా ప్రవాస భారతీయుడు విలాస్ రెడ్డి జంబుల ఆధ్వర్యములో టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డు లో బండి సంజయ్ ఫోటోలు, మోడీ ఫోటోలు, లక్ష్మణ్ కోవ, ఎంపీ అరవింద్, సోయం బాపురావు, జితేందర్ రెడ్డి తదితరుల ఫోటోలు కనిపించాయి.

జనరల్ గా ఈ బిల్ బోర్డు పైన స్టార్ హీరోల ప్రకటనలు, సినిమా ట్రైలర్, వరల్డ్ టాప్ మోస్ట్ బ్రాండడ్, టాప్ మోస్ట్ ప్రసిద్ధ పొలిటికల్ లీడర్స్ మాత్రమే కనిపిస్తుంటాయి. పది రోజుల పాటు బండి సంజయ్‌ యూఎస్‌ లోనే ఉండనున్నారు.

బండి సంజయ్ (Bandi Sanjay Kumar) ని కలుసుకోవడానికి ప్రవాస భారతీయులు ఎంతో ఆత్రుత, ఆనందముతో ఎదరు చూస్తున్నట్టు ఈ బిల్ బోర్డు ఏర్పాటు చేసిన విలాస్ రెడ్డి జంబుల తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected