Connect with us

Birthday Celebrations

ఘనంగా Dr. BR అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు @ Qatar

Published

on

Qatar: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ వారు చేసిన త్యాగాలకు మనందరం రుణపడి ఉండాలని గుర్తు చేస్తూ ఆయన జయంతి (Birthday) సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సీబీఎఫ్ మేనేజ్మెంట్ నెంబర్ శంకర్ గౌడ్ గారు హాజరై భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Bhimrao Ramji Ambedkar) గారి జయంతిలో పాల్గొనడం, వారి ఆశయాలకు అనుకూలంగా నడవాలని గుర్తు చేశారు.

తెలంగాణ గల్ఫ్ సమితి ఉపాధ్యక్షులు గడ్డి రాజుగారు మరియు ప్రధాన కార్యదర్శి సాయికి వంశి గారు మరియు లేబర్ వెల్ఫేర్ ఇంచార్జ్ మనోహర్ ఇన్సూరెన్స్ ఇంచార్జ్ సాగర్ గారు, కారం మారుతి గారు మరియు అడ్వైజర్ కమిటీగా మెంబర్ తాళ్లపల్లి ఎల్లయ్య గారు మరియు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected