ఇటు అమెరికాలో అటు రెండు తెలుగు రాష్ట్రాలలో భరత్ మద్దినేనిసుపరిచితమైన పేరు.గత 15 సంవత్సరాలుగా సమాజసేవలందిస్తున్న భరత్ తానా లో టీం స్క్వేర్ కో-చైర్ గా, సౌత్ ఈస్ట్ రీజనల్ కోఆర్డినేటర్ గా, విజిటర్ సర్వీసెస్ కో-చైర్ గా, వివిధ హోదాలలో మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతున్నారు.
తానా లో మాత్రమే కాకుండా, అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ లో జార్జియా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాలంటీర్ గా, ఆడిట్ కమిటీ సభ్యునిగా, టెక్నాలజీ సెక్రటరీగా, జనరల్ సెక్రెటరీగా, వైస్ ప్రెసిడెంట్ గా అలాగే గత సంవత్సరం అధ్యక్షునిగా చెరగని ముద్ర వేశారు.
పదవులలో ఉన్నా, లేకున్నా మరెన్నో సంస్థలలో సామాజిక, సేవా కార్యక్రమాల ద్వారా చేయూతనిస్తున్న మన భరత్ మద్దినేని, 2021-2023 కి గానుతానా జాయింట్ ట్రెజరర్ గా పోటీ చేస్తున్నారు.కావున మనందరం ఓట్ వేసి భరత్ తో పాటు నిరంజన్ శృంగవరపు గారి జట్టుని గెలిపిద్దాం.