Connect with us

Education

TANA పాఠశాల ఛైర్మన్ గా భాను ప్రకాష్ మాగులూరి నియామకం

Published

on

  • మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదు
  • తెలుగు భాషను చంపే తరంగా మనం మిగలకూడదు
  • ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘పాఠశాల’ కార్యక్రమం నిర్వహణ

Washington DC, USA: భాష సాంస్కృతిక వారధని భాను ప్రకాష్ మాగులూరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తానా (TANA) సంయుక్తంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో “తానా – పాఠశాల” విద్యార్థుల నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాలబాలికల తల్లి దండ్రులకు.. అమెరికా వ్యాప్తంగా పాఠశాల నిర్వహణ, పాఠ్యఅంశాల మీద అవగాహన కల్పిస్తూ, పుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దలు, ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాను మాగులూరి మాట్లాడుతూ.. మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదు. మన పిల్లలు ఏ భాషలో చదువుకున్నా.. చక్కటి తెలుగును వారికి నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. భాష మారిపోతోంది, సమాజం మారుతోంది, మన సంస్కృతి, సాంప్రదాయాలు మారుతున్నాయి.

కానీ అమెరికాలో మాత్రం వాటిని మనం సజీవంగా ఉంచుతున్నాం. భాష, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. సామాజికంగా ఎంతో ప్రభావితమైన స్థానంలో ఉన్న మనం మాతృభాషను బ్రతికించాలని కోరారు భాను మాగులూరి.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. అన్ని భాషల్లో గొప్ప భాష తెలుగు. అలాంటి తెలుగు (Telugu Language) భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలుగు భాషను చంపే తరంగా మనం మిగలకూడదు. ఏ భాష ప్రజలైనా వారి మాతృభాషలోనే మాట్లాడతారు.

అందుకు వారు గర్వపడతారు. ప్రపంచ తెలుగుదనాన్ని ఒక గొడుగు కిందకు చేర్చిన తానా.. తెలుగుజాతికి అమెరికాలో గుర్తింపు, గౌరవం తెచ్చారని కొనియాడారు. మానవ నాగరికత, వికాసంలో మనం అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాం. మన సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రుల తల్లి దండ్రులు పాల్గొని భాను మాగులూరిని సత్కరించారు. యెండూరి సీతారామారావు, అవిర్నేని రమేష్, ఆలంపల్లి రవి కుమార్, రమా దేవి (డిప్యూటీ డైరెక్టర్ ఖాదీ ఇండస్ట్రీస్), పొత్తూరి నాగసత్యనారాయణ రాజు, బిక్కిన వీర్రాజు, బాలచందర్, దయాకర్, శంకర్ ప్రసాద్ తదిదరులు ఈ TANA కార్యక్రమంలో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected