Telangana Association of Greater Houston (TAGH) ఆధ్వర్యంలో హ్యూస్టన్ మహా నగరంలో October 6 వ తేది ఆదివారం నాడు నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అమ్మవారి ఆశీర్వాదంతో సంప్రదాయబద్దంగా మరియు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ TAGH బతుకమ్మ సంబరాలకు హాజారయ్యే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ ఈ సంవత్సరం ఆరు వేలకు పైగా (6000+) చేరిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
పిల్లలు మరియు పెద్దలు అనే తేడా లేకుండా ఊహించని రీతిలో రెట్టింపైన ఉత్సాహాంతో సువిశాలమైన Edward Mercer Stadium ప్రాంగణమంతా బతుకమ్మ (Bathukamma) ఆటపాటలతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి TAGH తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
ట్యాగ్ (Telangana Association of Greater Houston – TAGH) సంస్థ యందు నమ్మకముంచి విరాళాలు అందించిన మరియు అందిస్తున్న దాతలందరికి, వాలంటీర్స్, లోగో స్పాన్సర్స్, ఫుడ్ స్పాన్సర్స్ మరియు మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
TAGH బోర్డు సభ్యులు, ధర్మకర్తలు, పూర్వ అధ్యక్షులు, కమ్యూనిటీ లీడర్స్ మరియు సలహాదారులు (Volunteers, TAGH Life Members, current Board Members, Past Board Members, Trustees, Advisors & Community Leaders) అహర్నిశలు శక్తి వంచన లేకుండా కృషి చేసిన సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులందరికి ఈ సందర్బంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం అన్నారు.