అటు కోకిల కూత.. కొమ్మల్లో పాడే తొలి ఉగాది పాట…
ఇటు మామిడి కాత.. ఒగరుతో మోసుకువచ్చే ఉగాది నెంటా…
చిరు వేప లేత పూత.. తనవెంట తీసుకువచ్చే ఉగాదినంతా ఓ ఓ…
వసంత ఋతువు వన్నే.. దోసిట్లో నింపుకు వచ్చే ఉగాది ఘనతా…
ఆరు రుచుల పచ్చడి అందించే బాటా ఉగాది వచ్చే…
ఏంటి బాటా ఉగాది వచ్చే అంటూ పాట పాడుతున్నారేంది అనుకుంటున్నారా? అదేనండి మన బే ఏరియా తెలుగు సంఘం ఉగాది సంబరాలు ఈ వచ్చే శనివారం మార్చ్ 24న ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మిల్పిటాస్ లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు అని చెప్పడం మా ఉద్దేశం. షడ్రుచుల సమ్మేళనం, నవ్వుల సందడి, ప్రేమకథ, శాస్త్రీయ నృత్య సమ్మేళనం, కొత్తబంగారులోకం మరియు నంది అవార్డు గ్రహీత డా. రవికుమార్ నరాలశెట్టి గారు ప్రదర్శిస్తున్న పల్నాటి భారతం ఇలా మరెన్నో చక్కని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా టికెట్స్ కోనేయండి.