బార్లీ గింజలలో అద్భుతమైన విటమిన్స్, మినరల్స్ మరియు ఫ్యాటీ యా యాసిడ్స్ ఉంటాయని, అలాగే బార్లీ నీళ్ల ఉపయోగాలు కూడా అందరికీ తెలిసిందే. కాకపొతే వీటిని ఇంకా ఏయే వాటికి వాడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మూత్ర విసర్జనకి చాలా ఉపయోగకరమైన ధాన్యం బార్లీ. అందుకే ఆయుర్వేద ఔషదాల్లో కూడా బార్లీని వాడతారు.
బార్లీలో ఉండే మెగ్నీషియం, కాల్షియం మధుమేహం వచ్చే అవకాశాల్ని తగ్గిస్తాయి. ఎముకలకు కావాల్సిన కాల్షియం బార్లీలో పుష్కలంగా ఉంది. మూత్రపిండాల నుండి టాక్సిన్లను తొలగిస్తూ మూత్రనాళ ఇన్ఫెక్షన్ రాకుండా సహకరిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన జలుబు, జ్వరం వంటివి రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బార్లీ నీళ్లు చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతూ మొటిమలు రాకుండా ఉంచుతాయి. అలాగే బార్లీ బరువు తగ్గడానికి, క్యాన్సర్ తదితర రోగాలను దూరంగా ఉంచుతాయి. కొంచెం అలసటగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ బార్లీ నీళ్లు తాగితే సరి, ఎక్కడలేని ఓపిక వస్తుంది. అందుకే బార్లీని తృణధాన్యాల రారాజు అని అంటారు.