Connect with us

Social Service

బాపయ్య చౌదరి సేవలు అందరికి ఆదర్శం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు

Published

on

పెదనందిపాడు: గుంటూరు జిల్లా: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరిచిపోకూడదనేది బాపయ్య చౌదరి (Bapaiah Chowdary) ని చూసి నేర్చుకోవాలని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అన్నారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న బాపు నూతిని అందరూ అభినందించాలని అన్నారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధుల సౌకర్యార్థం నాట్స్ బోర్డ్ డైరెక్టర్, నాట్స్ (NATS) పూర్వ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి తన మితృబందంతో కలిసి నిర్మించిన నూతి సుబ్బారావు, సీతాదేవి భోజనశాలను లావు నాగేశ్వరరావు ప్రారంభించారు.

బాపయ్య చౌదరి స్ఫూర్తితోనే తాను కూడా పెదనందిపాడు గ్రామ అభివృద్ధికి తన వంతు చేయూత అందిస్తానని తెలిపారు. జన్మభూమి రుణం తీర్చుకోవాలని తపించే వారు కొందరే ఉంటారని అలాంటి వారులో బాపు నూతి ఒక్కరని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prashant Pinnamaneni) అన్నారు.

తన స్వగ్రామం కోసం, తాను చదువుకున్న పాఠశాల కోసం బాపు చేస్తున్న కృషి మా అందరికి ఆదర్శమని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు పెదనందిపాడు పాఠశాల అభివృద్ధి కోసం బాపు నూతి చేస్తున్న కృషిని కొనియాడారు.

నాట్స్ (NATS) మన గ్రామం – మన బాధ్యత కార్యక్రమం ద్వారా తన స్వగ్రామం పెదనందిపాడు గ్రామములో విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు, మహిళా సాధికారత, యువ సాధికారత, మెగా నేత్ర, వైద్య శిబిరాలు, ZPPH స్కూల్ డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు, ఇంకా అనేక కార్యక్రమాలకు సహాయ, సహకారాలు అందిస్తున్న బాపయ్య చౌదరి (బాపు) తల్లిదండ్రులు నూతి సుబ్బారావు, సీతాదేవి గార్లను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఇదే పాఠశాలలో తమ జీవితకాలం పనిచేసి, వేలమంది విద్యార్థులకు విద్యాబోధన చేసి, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు రహంతుల్లా, హనుమంతరావు, చంద్రయ్య మాస్టర్ లను అతిథులు సత్కరించారు. అంతేకాక, ఈ పాఠశాలలో అత్యంత ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు.

మరియు ఇంకా ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల, రఘురాం రొయ్యురు, నాట్స్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ భీమినేని, గ్లో ఫౌండేషన్ సెక్రటరీ యార్లగడ్డ వెంకన్న చౌదరి.

స్థానిక నాయకులు మాజీ ఎం పి పి నర్రా బాలకృష్ణ, లావు శివరామకృష్ణ, దాసరి శేషగిరిరావు, ముద్దన రాఘవయ్య, అర్వపల్లి కృష్ణ, రామారావు పాశం, ఈ డైనింగ్ హాల్ నిర్వహణ కమిటీ సభ్యులు కాకుమాను నాగేశ్వరరావు, దాసరి సుబ్బారావు, దాసరి రమేశ్, సుజిత్ ఆలూరి, తదితరులు పాల్గొన్నారు.