Connect with us

Sports

చికాగో ఆంధ్ర సంఘం బాడ్మింటన్ పోటీలు విజయవంతం @ Naperville, Illinois

Published

on

చికాగో ఆంధ్ర సంఘం (CAA) వారు అక్టోబరు 20 ఆదివారం నాడు బాడ్మింటన్ పోటీలను విజయవంతంగా Naperville Play N Thrive నందు నిర్వహించారు. Men’s, Women’s, Mixed Doubles, Youth కు బిగినర్స్ మరియు ఎడ్వాన్స్డ్ విభాగాలలో ఈ పోటీలను నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి గారి సహకారంతో నిర్వహించారు.

నరసింహరావు వీరపనేని గారి నేతృత్వంలో జరిగిన ఈ పోటీలలో 110 మందికి పైగా చికాగో (Chicago) వాసులు చక్కని క్రీడా స్ఫూర్తి తో పాల్గొన్నారు. నాలుగున్నర గంటలలో 90 కు పైగా Matches ను నిర్వహించటం ప్రశంసనీయం. సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్లకు, Play N Thrive యాజమాన్యానికి మరియు సంస్థ సభ్యులకు చికాగో ఆంధ్ర సంఘం (CAA) వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ బాడ్మింటన్ (Badminton) పోటీల్లో విజేతలు మరియు రన్నర్-అప్ లకు సంస్థ స్పాన్సర్లు Hide and Seek Blinds నుండి దిలీప్ గారు, గ్రేడ్ పవర్ (Grade Power) నుండి ఆలెక్స్, మేడా డెంటల్ (Meda Dental) డా॥. సత్య గారు, Sriko Batteries శైలజ సప్ప మున్నగు ప్రభృతులు విచ్చేసి బహుమతులు అందజేసారు.

ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు, పోటీల నిర్వహణకు తమ సహకారాన్నందించిన కార్యకర్తలకు సంస్థ కార్యనిర్వాహక బృందం వారు పిజ్జాలు, స్థానిక ఇండియన్ రెస్టారెంట్ Bowl-O-Biryani నుండి ఎంతో రుచికరమైన భోజనం, అందించారు. మంచి ప్రణాళికతో నిర్వహించిన ఈ పోటీలకు మంచి స్పందన రావడం నిర్వాహకులను సంతోష పరచింది.

ఈ చికాగో ఆంధ్ర సంఘం ( Chicago Andhra Association – CAA) వారి బాడ్మింటన్ పోటీల విజయానికి బోస్ కొత్తపల్లి, ఆర్తీ శ్రీనాధ్, నందన్ నండూరి, సుబ్బు బెస్త, గోపాల్ సీలం, నరసింహ రెడ్డి ఒగ్గు,సురేశ్ కుమార్ ఐనపూడి, ఆశ్రిత్ కొత్తపల్లి, ఫణీంద్ర, ఆదినారాయణ, జిష్ణు వీరపనేని, అభిరాం నండూరి, కళ్యాణ్ కొత్తపల్లి తదితరులు కృషి చేశారు.

సంఘ బోర్డు సభ్యులు శ్రీనివాస్ పద్యాల, శ్రీకృష్ణ మతుకుమల్లి, మురళీ రెడ్డివారి, హేమంత్ తలపనేని, శైలజ సప్ప, శ్రీస్మిత నండూరి, గీతిక మండాల, తమిశ్ర కొంచాడ, అన్విత పంచాగ్నుల, పద్మారావు అప్పలనేని, నరేశ్ కుమార్ చింతమాని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, గిరి రావు కొత్తమాసు మరియు పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి, మాలతి దామరాజు, శ్రీ శైలేష్ మద్ది, ట్రస్టీలు సుజాత అప్పలనేని ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected