Connect with us

Schools

TANA New Jersey Chapter: విద్యార్థులకు స్కూల్ సామాగ్రి, బ్యాగుల పంపిణీ

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘము ‘తానా’ న్యూజెర్సీ టీం (TANA New Jersey Chapter) అధ్వర్యంలొ ఫ్రీహొల్డ్ బరొ స్కూల్ లొ విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ చెయటం జరిగింది. దాదాపు 200 మంది స్కూల్ విధ్యార్ధులకి స్థానిక స్కూల్ అధికారులు, పొలిస్ అధికారులు మరియు తానా ప్రథినిధుల చెతులమీదగా బాక్ ప్యాక్లూ మరియు స్కూల్ సామాగ్రిని అందించారు.

అమెరికాలోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా అధ్యక్షులు నరేన్ కొడాలి (Naren Kodali) మరియు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు (Srinivas Lavu) నాయకత్వంలొ తానా ఈ బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తొందని తానా ప్రథినిధుల తెలియచెసారు.

తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ చంద్ నారెపాలెపు (Sudheer Chand Narepalepu) మరియు స్కూల్‌ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచినందుకు తానా కోశాధికారి రాజా కసుకుర్తి (Raja Kasukurthi) కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచెసారు. విద్యార్థుల తల్లితండ్రులు కూడా తానాకు తమ అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తానా కోశాధికారి రాజా కసుకుర్తి, తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ చంద్ నారెపలుపు, తానా యూత్ కోఆర్డినేటర్‌ శ్రినివాస్ చెరుకురి, తానా ఫౌండేషన్ ట్రస్టీలు శ్రినివాస్ ఒరుగంటి (Srinivas Oruganti), సతీష్ మేకా (Satish Meka) మరియు తానా సేవకులు సుధీర్ రామపురం, ఉమా రవి, కిరణ్ భాసన, వెంకట్ పుసులూరి, రామక్రిష్ణ చెరుకురి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫ్రీహొల్డ్ బరొ స్కూల్ స్కూల్‌ (Freehold Borough School District) నిర్వాహకులు, టీచర్లు మాట్లాడుతూ, తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా బ్యాక్‌ ప్యాక్‌ (TANA Backpack) కింద తమ స్కూల్‌‌ను ఎంపిక చేసుకుని పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌‌లను పంపిణీ చేసినందుకు వారు స్థానిక తానా నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.

error: NRI2NRI.COM copyright content is protected