Connect with us

Movies

పవన్‌ కళ్యాణ్ పై ఎందుకు వివక్ష? జగన్ను ప్రశ్నించిన చంద్రబాబు

Published

on

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు జగన్ పై నిప్పులు చెరిగారు. డాక్టర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం పోయింది. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. తాజాగా పవన్‌ కల్యాణ్‌ ని కూడా జగన్‌ టార్గెట్ చేశారు. పెద్ద హీరోల సినిమాల విడుదల సందర్భంగా ప్రత్యేక షోలు వేసుకోవడం, రిలీజైన తొలి రోజుల్లో ధరలు పెంచుకోవడం మాములే. కానీ పవన్‌ కళ్యాణ్ వకీల్‌ సాబ్ సినిమాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయనపై ఎందుకు వివక్ష? మీ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనా? ఇంకా ఎంతకాలమీ దుర్మార్గం? ఏమిటీ ఈ రాక్షసానందం? అంటూ నిప్పులు చెరిగారు బాబు. ఈ దుర్మార్గాలు తగ్గాలంటే తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం ఒక్కటే మార్గం అన్నారు.