Connect with us

Associations

ఆటా (ATA) లో అమెరికన్ తెలంగాణ సొసైటీ (ATS) విలీనం అధికారికం

Published

on

సెప్టెంబర్ 9న అట్లాంటాలో జరిగిన ఆటా (American Telugu Association – ATA) బోర్డు సమావేశంలో భాగంగా వివిధ అమెరికా రాష్ట్రాల నుంచి విచ్చేసిన అధ్యక్ష బృంద సభ్యులు, ధర్మకర్తల మండలి, అడ్వైజరీ కమిటీ, సుమారు 100 మంది బోర్డు సభ్యులు, అడ్హాక్ టీం మరియు ఇతర ఆటా సభ్యులు పాల్గొనగా, 2024- జూన్ నెలలో అట్లాంటా లో జరుగనున్న ఆటా మహాసభలకు సంబంధించి చేపట్టవలసిన వివిధ చర్యలు మరియు అజెండాల గూర్చి చర్చలు జరిపారు.

సమావేశం ప్రధాన అంశంగా అమెరికన్ తెలంగాణ సొసైటీ (American Telangana Society – ATS) ఆటా లో విలీనం అవ్వగా 18 వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ ఉత్సవాలకు రెట్టింపు ఉత్సాహంతో శ్రీకారం చుట్టింది. చరిత్రాత్మక వికాసంగా అమెరికన్ తెలంగాణ సొసైటీ ఆధికారికంగా అమెరికా తెలుగు సంఘంలో మమేకమవ్వగా, దృఢమైన మరియూ ఏకీకృత సేవా సంస్థగా తెలుగు తల్లి సన్నిధిగా, ప్రవాసాంధ్రుల సేవా పెన్నిధిగా, అమెరికాలో ఆటా గమనం చరితార్థమవ్వగా ఈ విలీనం స్ఫూర్తిదాయకం.

ఈ అద్భుత అంశం అట్లాంటాలో జరిగిన ఆటా (ATA) మూడవ బోర్డు సమావేశంలో భాగంగా సగౌరవంగా ప్రకటించబడింది. పలు దశాబ్దాలుగా అమెరికానందున్న ప్రవాసాంధ్రుల ప్రజా సేవా సారథిగా ఘన చరితను కైవశం చేసుకుంటున్న ఆటా సంస్థతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సగౌరవంగా, ప్రకాశవంతంగా ప్రజ్వలింపచేస్తున్న సంస్థ అమెరికన్ తెలంగాణ సొసైటీ మమేకం. ఈ ఇరు మహోత్తర సేవా సంస్థల కలయిక పరస్పర సహకారాలతో సాంప్రదాయ, సాంస్కతిక, సాంఘిక, సామాజిక, విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాలతో అమెరికాలో వున్న తెలుగు ప్రజలను ఆదరించనుంది.

మధు బొమ్మినేని, ఆటా అధ్యక్షురాలు, మాట్లాడుతూ ఈ మహత్తర కలయిక ఎన్నో అత్యద్భుత సేవా కార్యక్రమాలకు నాంది అంటూ హర్షం వ్యక్తంచేశారు. అమెరికన్ తెలంగాణ సొసైటీ (ATS) అధ్యక్షులు నరేందర్ చేమెర్ల మాట్లాడుతూ అమెరికా తెలుగు సంఘం (ఆటా) సంస్థ తో విలీనం “ప్రవాసాంధ్రుల మరియు భావి భారతీయుల పట్ల సేవా సంకల్పానికి అసమాన బలం అని తమ ఆనందోత్సాహాలను వ్యక్తపరిచారు.

సెప్టెంబరు 9 సాయంత్రం జరిగిన ఆటా కిక్ ఆఫ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 300 మంది స్థానిక తెలుగు సంఘాల నేతలు హాజరవ్వగా ఆటా కన్వెన్షన్ లోగో మరియు కిక్ ఆఫ్ సాంగ్ ఆవిష్కరణ, విరాళాల సేకరణ, అడ్హాక్ టీం ప్రకటన, కన్వెన్షన్ కోర్ కమిటీ సభ్యుల పరిచయం, అధ్యక్షులు శ్రీమతి మధు బొమ్మినేని గారి ప్రోత్సాహభరిత ప్రసంగం వంటి పలు ప్రధాన అంశాలతో ఆటా 2024 కన్వెన్షన్ కై ముమ్మర సన్నాహాలతో అంకురార్పణ చేశారు.

ఈ అడ్హాక్ బృందం సభ్యులుగా అధ్యక్షురాలు మధు బొమ్మినేని (Madhu Bommineni), ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షులు భువనేశ్ బూజాల, కన్వీనర్ కిరణ్ పాశం, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొడ్డిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని మరియు ఇతర ఆటా (ATA) విశిష్ఠ నాయక బృందాన్ని సభాముఖంగా ప్రకటించింది.

భారత దేశంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో జరుగనున్న ఆటా వేడుకలు 2023 డిసెంబరు నెలలో 10 నుండి 30 వరకు నిర్ణీతమయినవిగా ప్రకటించారు. ఆటా మరియు 18వ ఆటా మహాసభలను (18th Convention and Youth Conference) గురించిన పూర్తి సమాచారం www.NRI2NRI.com/ATA నందు పొందగలరు. 18వ ఆటా కాన్ఫరెన్స్ సాంగ్ యుట్యూబ్ లో వీక్షించవచ్చు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected