అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంక్షేమం, సాంస్కృతిక పరిరక్షణ మరియు సామాజిక సేవలను లక్ష్యంగా తీసుకుని పనిచేస్తున్న ఆత్మీయ సంస్థ, తన 2026–27 కార్యవర్షానికి నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు కార్యనిర్వాహక బృందాన్ని అధికారికంగా ప్రకటించింది. సేవ, నాయకత్వం మరియు సమగ్ర అభివృద్ధి దృక్పథంతో రూపొందిన ఈ బృందం, ATMIYA లక్ష్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది.
కార్యనిర్వాహక & బోర్డు నాయకత్వం
ఆనంద్ చిక్కాల – నేషనల్ ప్రెసిడెంట్ (Executive Committee)
డా. మంజుల రఘుతు, MD – బోర్డు ఛైర్ (Board Chair)
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు
బాబు అంగిన, బాబు టేకి, కృష్ణ కోడెబోయిన, నవీన్ నాయుడు, ఓంప్రకాష్ నక్క, రవి బొట్ల, రాజ్ బొరుసు, స్వాతి మండలి, సుధీర్ నాగం
కార్యనిర్వాహక బృందం (Executive Committee)
రమేష్ నయనాల (Secretary), వెంకట్ ఏరుబండి, సత్య వెజ్జు, సురేష్ వెజ్జు, వంశీ పసుపులేటి, బిందు నయనాల, రమ ముత్యాల, శశాంక్ నిమ్మల, బిందు నయనాల, వెంకట నాగిరెడ్డి, శెసి ఎరుబండి, కొండలరావు కోలా, నీలిమ రామిశెట్టి, పద్మ కందికట్టు, హరీష్ ఆదిమూలం, సిద్దు కోలా మరియు ఇతర సభ్యులు.
నూతన నాయకత్వ బృందం, ఆర్థిక పారదర్శకత, సభ్యత్వ విస్తరణ, యువత భాగస్వామ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ మరియు సామాజిక సేవలను ప్రధాన లక్ష్యాలుగా తీసుకుని పనిచేయనుంది. 2026–27 కాలంలో ATMIYA USA సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు మరియు కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
నూతన బోర్డు మరియు కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయ USA సంస్థ వారి సమిష్టి కృషి ద్వారా, సేవా కార్యక్రమాల (Service Activities) ద్వారా సంస్థ మరింత ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.