Connect with us

Festivals

అక్టోబర్ 19న తెలుగింటి ఆడపడుచులకు అట్లతద్దె వేడుకలు @ Washington DC

Published

on

. లోగోను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
. ఏపీ రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ
. ఈ నెల 19న వాషింగ్టన్ డీసీ లో అట్లతద్దె వేడుకలు

వాషింగ్టన్ డీసీ, అమెరికా: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన అట్లతద్దె (Atla Tadde) పండుగను వాషింగ్టన్ డీసీ (Washington DC) లో ఈనెల 19న ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రవాసాంధ్రులు తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. ముగ్గులు, ఆటల పోటీలు, భరతనాట్యం, కూచిపూడి తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

దీనికి సంబంధించిన లోగోను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) అక్కడ ఆవిష్కరించారు. తెలుగువారికి ప్రత్యేకమైన అట్లతద్దె లాంటి పండుగలు నిర్వహించడం ద్వారా మన సంస్కృతిని కాపాడటానికి ప్రవాసాంధులు విశేష కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. తెలుగు భాష, కళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ… వారి పిల్లలకూ నేర్పించడం అభినందనీయమన్నారు.

తెలంగాణ (Telangana) లో బతుకమ్మ పండుగ (Bathukamma Festival) ను అధికారికంగా నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలోనూ అట్లతద్దెను అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) పూర్వ అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు ఆయనను కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తో చర్చించి అట్లతద్దెను అధికారికంగా నిర్వహించేలా కృషిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తెలుగు మహిళలకు అట్లతద్దె ఎంతో ఇష్టమైన పండుగని సాయిసుధ పాలడుగు (Sai Sudha Paladugu) అన్నారు. ఈ కార్యక్రమంలో సుధ కొండపు, అనిత మన్నవ, నవ్య ఆలపాటి, నీలిమా చనుమోలు, సరిత బొల్లినేని, ఇందు చలసాని, శిరీష నర్రా, సుష్మ అమృతలూరి, మల్లి నన్నపనేని, వల్లి కుర్రే, సరిత ముల్పూరి తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected