జూన్ 2న అట్లాంటాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో ధీం-తానా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. స్థానిక అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 350 మందికి పైగా హాజరయ్యారు. టీవీ9 మరియు యన్టీవీ లో ప్రసారం కాబోయే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా సమన్వయపరచిన నీలిమ గడ్డమనుగు, మాధవి కొర్రపాటి, మాలతి నాగభైరవ, సోహిని అయినాల తోపాటు తానా, తామా కార్యవర్గ సభ్యులు మరియు అట్లాంటా పెద్దలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
సంగీత, జానపద, సినీ పాటల పోటీలు, గ్రూప్ డాన్స్ పోటీలు, మరియు మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా పోటీలు అందరిని ఆకట్టుకున్నాయి. పాటల పోటీలకు ఫణి డొక్కా, పద్మ పుచ్చ మరియు రామ్ దుర్వాసుల, నృత్య పోటీలకు హనుమంతరావు యలమంచిలి, ఉష అన్నెపు మరియు శివ తుర్లపాటి, అలాగే అందాల పోటీలకు ప్రీతి మునగపాటి, శివ తుర్లపాటి, ప్రసూన కోట మరియు పద్మజ నిమ్మగడ్డ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మధ్యలో అట్లాంటా స్థానిక గాయకులు రామ్ దుర్వాసల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన పాటలతో ఉర్రూతలూగించారు.
తదనంతరం తానా పెద్దలు అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, యాడ్ హాక్ కమిటీ సభ్యులు, అలాగే ఇతర ప్రాంతీయ మరియు జాతీయ సంస్థల పెద్దల చేతులమీదుగా పాటల పోటీల విజేతలకు, నృత్య పోటీల విజేతలకు పతకాలు అందజేశారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన మహిళా పెద్దలు మిస్ టీన్ తానా, మిస్ తానా, మరియు మిసెస్ తానా విజేతలకు క్రౌన్ మరియు శాశ్ బహుకరించారు. ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలను, సమన్వయకర్తలను మరియు స్పాన్సర్స్ ను శాలువా, మెమెంటో మరియు పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
చివరిగా తానా దక్షిణ తూర్పు సమన్వయకర్త భరత్ మద్దినేని మాట్లాడుతూ స్టేజిని అందంగా అలంకరించిన ఏఆర్ డాజిల్ ఈవెంట్స్ అనూష మాచర్ల మరియు రజినీకాంత్ మాచర్ల, ఆడియో లైటింగ్ ఫోటోగ్రఫీ సేవలందించిన ట్రెండీ ఈవెంట్స్ శ్రీని టిల్లు, రుచికరమైన భోజనాలు అందించిన పెర్సిస్ బిర్యానీ ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్ శ్రీధర్ దొడ్డపనేని, స్నాక్స్, టీ మరియు కాఫీ అందించిన సంక్రాంతి రెస్టారంట్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, స్పాన్సర్స్ అంజయ్య చౌదరి లావు, డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ శ్రీనివాస్ లావు, అలాగే తమ సహాయసహకారాలందించిన అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, విజయ్ కొత్తపల్లి, భరత్ అవిర్నేని, వెంకీ గద్దె, వినయ్ మద్దినేని, నగేష్ దొడ్డాక, శ్రీనివాస్ ఉప్పు, ఆదిత్య గాలి, ఇన్నయ్య ఎనుముల, సుబ్బారావు మద్దాళి, వెంకట్ మీసాల, మల్లిక్ మేదరమెట్ల, రాజేష్ జంపాల, రవి కొల్లి, రామ్ మద్ది, పూర్ణ వీరపనేని, విజు చిలువేరు, రవి పోనంగి, గిరి సూర్యదేవర, ఉపేంద్ర నర్రా, శ్రీనివాస్ గుంటక, సాయిరాం కారుమంచి, టీవీ9 మరియు యన్టీవీ యాజమాన్యం, టీవీ ఏషియా అంజలి, టీవీ9 శివ రామడుగు, జి యన్ యన్ టీవీ నిరంజన్ పొద్దుటూరి, న్యాయ నిర్ణేతలు మరియు ధీం-తానా కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన అశేష ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేయగా కార్యక్రమం ముగిసింది.