Connect with us

Associations

అమరావతి ఉద్యమానికి అట్లాంటా ప్రవాసాంధ్రుల సాయం అక్షరాలా 14 లక్షల 96 వేల 16 రూపాయలు

Published

on

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు సుమారు 456 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అమరావతి రైతులకు మద్దతుగా అమెరికాలోని తెలుగువారు ఎన్నారైస్ ఫర్ అమరావతి సంస్థను నెలకొల్పారు. ఒక రాష్ట్రం ఒక రాజధాని అనే నినాదంతో తమవంతు సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా బొడ్డు మురళి, మేదరమెట్ల మల్లిక్, లావు శ్రీనివాస్ మరియు లావు అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటా ప్రవాసులు 14 లక్షల 96 వేల 16 రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, మున్ముందు కూడా రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలకు తమ మద్దతు ఉంటుందన్నారు. అలాగే తమ పిలుపు మేరకు స్పందించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసారు.