తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడిని (Nara Chandrababu Naidu) ని అప్రజాస్వామికంగా అర్ధరాత్రిపూట చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ అక్రమ అరెస్టు విషయం తెలిసిన వెంటనే ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న నిరసన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ఒక పక్కా పథకం ప్రకారం చంద్రబాబుని రాజమండ్రి జైలుకి రిమాండ్ కి పంపడంతో అట్లాంటా తెలుగు ప్రవాసులు మరోసారి బాబుకి బాసటగా నిలవాలని తలచారు.
దీంతో గత వారాంతం రెండోసారి సెప్టెంబర్ 16, శనివారం రోజున బ్యూఫోర్డ్ డాం పార్క్ లో అట్లాంటా తెలుగు ప్రవాసులు పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, చంద్రబాబు అభిమానులు పాల్గొని నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఉయ్ ఆర్ విత్ సీబీఎన్, సైకో పోవాలి.. సైకిల్ రావాలి, ఉయ్ డిమాండ్ జస్టిస్, బాబు రావాలి.. అభివృద్ధి జరగాలి, బాబు సాఫ్ట్వేర్.. జగన్ మాల్వేర్, సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ.. జగన్ మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ, జై బాబు.. జై జై బాబు అంటూ నినాదాలు (Slogans) చేశారు.
అనంతరం ప్లకార్డులు పట్టుకొని బ్యూఫోర్డ్ డాం పార్క్ (Buford Dam Park) చుట్టూ నడుస్తూ ర్యాలీ చేశారు. ఈ ప్రొటెస్ట్ లో చంద్రబాబు (Nara Chandrababu Naidu) అరెస్టుని ముక్తఖంటంతో ఖండించారు. న్యాయస్థానం ఈ ఫేక్ కేసుని కొట్టివేసి బాబుని వెంటనే విడుదల చేయాలని అభిలాషించారు.
ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు, పెద్దలు, పిల్లలు సైతం పాల్గొనడం విశేషం. అలాగే తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) వారే కాకుండా ఇతర తెలుగు ప్రవాసులు (Telugu NRIs) కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని బాబుకి బాసటగా నిలబడడం చూసి అందరూ అభినందించారు.