Connect with us

Events

Atlanta Telugu Mahila రెండవ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 2న

Published

on

‘అట్లాంటా తెలుగు మహిళ’ (Atlanta Telugu Mahila) రెండవ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 2 శనివారం రోజున నిర్వహిస్తూన్నారు. ‘తగ్గేదేలే రిటర్న్స్’ అంటూ మెట్రో అట్లాంటా (Metro Atlanta) పరిసర ప్రాంతాల్లో ఉంటున్న తెలుగు మహిళలు అందరి కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

సూపర్ విమెన్ ఈవెంట్స్ (SuPr Women Events) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కమ్మింగ్ (Cumming) నగరం లోని బంజారా బాంక్వెట్ హాల్ (Banjara Banquet Hall) వేదిక కానుంది. ఈ ఈవెంట్ కి రాయల్ బ్లూ డ్రెస్ కోడ్. షాపింగ్ స్టాల్ల్స్ మరియు స్పాన్సర్షిప్ కోసం సునీత (404-988-9429) లేదా ప్రియా (321-312-7103) లను సంప్రదించండి.

చక్కని ఎంటర్టైన్మెంట్ (Entertainment) తో సరదా ఆటలు, రుచికరమైన భోజనం, బెస్ట్ డ్రెస్సెడ్ పోటీలు, సూపర్ చెఫ్ బెస్ట్ డిష్ పోటీలు, ఫాషన్ షో, బహుమతులు, డాన్స్ ఫ్లోర్ విత్ డీజే, ఫోటో బూత్, షాపింగ్ స్టాల్ల్స్ లాంటి మరెన్నో ప్రత్యేకతలు అందరినీ ఆకట్టుకోనున్నాయి. ఇతర వివరాలకు ఫ్లయర్స్ చూడండి. టికెట్స్ కొరకు www.NRI2NRI.com/Atlanta Telugu Mahila 2nd Anniversary ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected