అట్లాంటా (Atlanta) ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఇండియాలో దివ్యాంగులకు ఒక రోజంతా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నిడదవోలులో హృదయాలయం అనే ఉచిత మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మరియు పునరావాస కేంద్రంలో వెంకట్ (Venkat Duggireddy) తన వితరణ చాటుకున్నారు.
అక్టోబర్ 4 శుక్రవారం రోజున తన పుట్టిన రోజు (Birthday) ని పురస్కరించుకొని వినూత్నంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి పౌష్టికాహారంతో కూడిన భోజనాలు అందించారు. వెంకట్ దుగ్గిరెడ్డి మరియు వారి శ్రీమతి మాధవి దుగ్గిరెడ్డి (Madhavi Duggireddy) పేర్లు మీద ఒక మంచి ఆలోచనతో ముందుకు రావడం అభినందనీయం.
గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ (Tollywood) సినిమాలలో నటిస్తున్న వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) కి ఇటువంటి సేవాకార్యక్రమాలు కొత్తేమి కాదు. నలుగురికి ఉపయోగపడే పనులకు ఎప్పుడూ ముందుండి ఆర్ధిక సహాయం అందిస్తుంటారన్న విషయం అమెరికాలోని అట్లాంటా (Atlanta) వాసులకు తెలిసిందే.
ఈ సందర్భంగా నిడదవోలు (Nidadavole) లోని హృదయాలయం ఉచిత మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మరియు పునరావాస కేంద్రం నిర్వాహకులు అడగ్గానే సహాయం చేసిన వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) ని రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా అంటూ అభినందించారు.