Connect with us

Events

Atlanta for Ramu Venigandla: అక్టోబర్ 13న ఏకాభిప్రాయ మద్దతు

Published

on

అమెరికాలోని అట్లాంటా నగర ఎన్నారై, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాము వెనిగండ్ల 2024 ఎన్నికలలో గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam Party) తరపున శాసనసభకు పోటీ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే.

సౌమ్యునిగా, హడావుడి ప్రచారాలకు దూరంగా ఉండే భూరి విరాళ ప్రధాత రాము అట్లాంటా (Atlanta) వాసులకు చాలా ఆప్తులు. ముఖ్యంగా లాభాపేక్షలేని సంస్థలకు సహాయం చేయడంలో ముందుండే రాము కి ఏకాభిప్రాయంతో మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన (Janasena) మరియు శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే గుడివాడ (Gudivada) గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా తిరిగి ఎగరవేసేలా ప్రణాళికాబద్ధంగా చాపకింద నీరులా పనులు చక్కబెడుతున్న రాము వెనిగండ్ల ఆలోచనలు, విశ్లేషణలు పంచుకునేలా అందరూ అక్టోబర్ 13 శుక్రవారం రోజున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు.

‘Atlanta For Ramu Venigandla’ అంటూ రాము వెనిగండ్ల కి సంపూర్ణ మద్దతు తెలుపుతూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. సంక్రాంతి రెస్టారెంట్ (Sankranti Restaurant) బాంక్వెట్ హాల్లో ఈ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు నిర్వహిస్తున్న ఈ మద్దతు కార్యక్రమంలో పాల్గొనడానికి www.NRI2NRI.com/Atlanta for Ramu Venigandla లో RSVP చేయండి.

error: NRI2NRI.COM copyright content is protected