మార్చ్ 31న ఆల్బని తెలుగు సంఘం ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ రాజధాని ఆల్బని నగరంలో స్థానిక కొలంబియా ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఉత్సవాలకు సుమారు 1400 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. చిన్నారులకు మన సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శ్రీరామ కళ్యాణం థీమ్ అందరిని ఆకట్టుకుంది. అందరికి పానకం వడపప్పు అందజేశారు. సాయంత్రం 2 గంటలకు మొదలైన ఉగాది ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, యాంకర్ ఉదయభాను వ్యాఖ్యానం, గాయకులు మల్లిక్ గోపికల పాటలు, జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి చిన్నలతో పెద్దలతో చేయియించిన నవ్వుల కామెడీ డాన్సులు, సినీ నటి శ్రీదేవి సినిమాలలోని పాటలకు చేసిన డాన్సులు, ఉగాది పచ్చడితోపాటు పసందైన భోజనం అద్భుతో అద్భుతహ. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీవీ9 రవి ప్రకాష్ మరియు తానా మాజీ అధ్యక్షులు మోహన్ నన్నపనేని పాల్గొన్నారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆల్బని తెలుగు అసోసియేషన్ కార్యవర్గాన్ని అందరూ అభినందించారు.