Connect with us

Associations

అమెరికా తెలంగాణ సంఘం మహాసభలు

Published

on

అమెరికా తెలంగాణ సంఘం ప్రపంచ మహాసభలు సత్యనారాయణ రెడ్డి కందిమళ్ల అధ్యక్షతన టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో జూన్ 29 నుండి జులై 1 వరకు జరగనున్నాయి. మహా కవి డాక్టర్ సి నారాయణరెడ్డి గారికి అంకితం చేస్తూ నిర్వహిస్తున్న ఈ మహాసభలలో భాగంగా శాస్త్రీయ నృత్యాలు, పాటలు, నాటకాలు, మిమిక్రీ, సినీ నాట్యాలు, జానపద గీతాలు, ఫ్యాషన్ షో తదితర విభాగాలలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి మహోత్తర అవకాశాన్ని కల్పిస్తున్నారు మన అమెరికా తెలంగాణ సంఘం కార్యవర్గం. మీ పేరు నమోదు చేసుకోవాలంటే ఏప్రిల్ 30 లోపు సాంస్కృతిక కార్యక్రమాల చైర్మన్ శారద ఆకునూరి గారిని లేదా వైస్ చైర్మన్లు ప్రసాద్ కాల్వ మరియు మాధవి రెడ్డి గార్లను సంప్రదించండి. అలాగే పల్లె పాట ఆటా నోట అంటూ అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో జూన్ 2 నుండి 17 వరకు సాగే జానపద మరియు సినిమా పాటల పోటీలలో పాల్గొనాలంటే www.ataconvention.org సందర్శించండి.  ఈ కార్యక్రమాలన్నీ కూడా టీవీ5 మరియు మనటీవీలో ప్రత్యక్షప్రసారం చేయబడును. సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ ఆటా మహాసభలలో నిర్వహించబడును. అలాగే గెలిచినవారికి ప్రత్యేక కాష్ ప్రైజులు కూడా ఇవ్వబడును. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీ పేరు నమోదు చేసుకోండి.

 

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected