వాషింగ్టన్ డీసీ ATA యూత్ క్రికెట్ టోర్నమెంట్ 2023 కొలంబస్ డే (Columbus Day) సందర్భంగా అక్టోబర్ 7, 2023న ఉత్తర వర్జీనియాలో విజయవంతంగా నిర్వహించారు. రాబోయే టర్మ్ కి ఆటా (American Telugu Association) అధ్యక్షుడిగా ఎన్నికైన జయంత్ చల్లా గారు ఈ యూత్ క్రికెట్ టోర్నమెంట్ (Youth Cricket Tournament) ని ప్రారంభించారు.
ఈ యూత్ టోర్నీలో అండర్ -11 విభాగంలో 6 జట్లు పోటీపడగా, అండర్ -13 మరియు అండర్ -15 విభాగాల్లో నాలుగు జట్లు విజయం కోసం పోటీ పడ్డాయి. దాదాపుగా 40% మంది ఆటగాళ్ళు బాలికలు కావడం విశేషం. మల్ల కాల్వ, వెంకట్ వూటుకూరి, అమర్ పశ్య, కిరణ్ పాడేరు, ప్రవీణ్ రెడ్డి ఆళ్ల, పవన్ పెండ్యాల డిసి ఏరియాలోని వాలంటీర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసారు.
శ్రీ మొగుల్లా, కౌశిక్ సామ రవి చల్లా మరియు సుధీర్ దామిడి మొదలగు వారి అంకితభావం టోర్నీ సాఫీగా సాగేలా చేసింది. ATA ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు హర్ష బారెంకాబాయి శీతల్ బొబ్బా, పవన్ గోవర్ధన, కిరణ్ పదేరా, శ్రీధర్ సనా, శ్రీధర్ మొగుల్లా, హనిమి వేమిరెడ్డి, దామరాజు ప్లానింగ్ నుండి ముగింపు వేడుక వరకు అవిశ్రాంతంగా పనిచేశారు.
అక్టోబరు 9వ తేదీ జరిగిన గ్రాండ్ ఫినాలేకు ఆటా మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బూజాల (Bhuvanesh Boojala) గారు మరియు దీపికా బూజాల గారు, సుధీర్ బండారు, విష్ణు మాధవరం హాజరయ్యారు. వాషింగ్టన్ క్రికెట్ అకాడమీ మరియు వాషింగ్టన్ మెట్రో క్రికెట్ లీగ్ తోడ్పాటు తో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో అండర్ 11 విజేతలుగా WCA చాంప్స్, అండర్ 13 విజేతలుగా WCA గ్లాడియేటర్స్, అండర్ 15 విజేతలుగా FSCC షార్క్స్ నిలిచారు.
Cricket టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు సహాయం చేసిన స్పాన్సర్లకు – హలో 2 ఇండియా, డేటా పార్టికల్స్, కాకతీయ కిచెన్, రేడియంట్ ప్లానెర్స్, కోల్డ్ స్టోన్ క్రీమరీ మరియు ఫార్చ్యూన్ ఫార్మ్కి నిర్వాహకులు ధన్యవాదాలు తెలియచేసారు. ఈవెంట్ కవరేజీని అందించినందుకు మీడియా మిత్రులు TV5 కి ధన్యవాదాలు తెలియచేసారు.