Connect with us

Community Service

ఆటా వేడుకలు, సేవాకార్యక్రమాలు కోలాహలంగా ప్రారంభం: Andhra Pradesh, Telangana

Published

on

డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 26 వరకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా వేడుకలు, సేవా డేస్’ పేరుతో భారతావనిలో పెద్దఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆటా 17వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో జులైలో 1-3 తేదీలలో నిర్వహించనున్న సందర్భంగా ఈ వేడుకలు, సేవాకార్యక్రమాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కళలు, స్కూల్స్ అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యాలుగా కార్యక్రమాలు రూపొందించారు.

ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటా వేడుకల చైర్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కో-చైర్ గా అట్లాంటాకి చెందిన అనిల్ బొద్దిరెడ్డి మరో కో-చైర్ గా న్యూ జెర్సీకి చెందిన శరత్ వేముల వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 5న గోడపత్రిక ఆవిష్కరించి కార్యక్రమాల వివరాలు తెలియపరిచారు. డిసెంబర్ 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే మహోత్సవం నిర్వహించనున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected