Connect with us

News

ఆంధ్ర, తెలంగాణలో డిసెంబర్లో పెద్ద ఎత్తున ATA వేడుకలు, హైదరాబాద్ లో గ్రాండ్ ఫినాలే

Published

on

గత ఇరవై సంవత్సరాలుగా ఆటా వేడుకలు (ATA Vedukalu) పేరుతో అమెరికా తెలుగు సంఘం ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదిలిపెట్టి నిర్విరామంగా నిర్వహిస్తుంది. తెలుగు భాష, సాహిత్యాలను ప్రేమిస్తూ విశేష కృషి చేస్తూ వస్తున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆటా వేడుకలు ఘనంగా జరగటం విశేషం.

ఆటా (American Telugu Association – ATA) సేవల్లో భాగమైన సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాల్లాంటి మరెన్నో రంగాల్లో పలు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన మిషన్ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, ఆటా తెలుగు తేజాన్ని నాలుగు దిశల విస్తరింప చేస్తూ ఉన్నది.

విశ్వఖ్యాతిగా మన తెలుగును బహుళ ప్రచారం చేస్తూ భవిష్యత్తు తరాలను ప్రభావితపరుస్తూ ఉన్నది. తేనెలొలుకు తెలుగు తియ్యదనాన్ని ప్రచారం చేస్తూ తెలుగు మాతృభాష గల ప్రజలను, భాషాభిమానులను ఆకర్షిస్తూ ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తు నిర్మాణానికి ఎంతగానో ఈ ఆటా వేడుకలు ఉపయోగపడుతున్నాయి.

ఆటా అధ్యక్షుడు శ్రీ జయంత్ చల్ల (Jayanth Challa) గారి సహాయ సహకారాలతో, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ & ఆటా వేడుకల కమిటీ చైర్ శ్రీ సతీష్ రెడ్డి (Satish Reddy) గారి ఆధ్వర్యంలో ఆటా వేడుకలు డిసెంబర్ 12 నుండి 27 వరకు జరగబోతున్నాయి.

డిసెంబర్ 12 – రంగా రెడ్డి జిల్లాలో స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు.
డిసెంబర్ 13: – సంగారెడ్డి – ఐఐటీలో స్టార్ట్ అప్ పిచ్.
డిసెంబర్ 14: – హైదరాబాద్ లో సాహిత్య కార్యక్రమం.
డిసెంబర్ 16–17: బిజినెస్ సెమినార్స్ – హైదరాబాద్, విశాఖపట్నం.

డిసెంబర్ 20–23: స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాటర్ ప్లాంట్ మరియు ఉమెన్స్ హెల్త్ క్యాంప్స్.
డిసెంబర్ 24–25: పిల్లల కొరకు హెల్త్ క్యాంప్స్ మరియు చారిటబుల్ ప్రోగ్రామ్స్.
డిసెంబర్ 27: గ్రాండ్ ఫినాలే రవీంద్ర భారతి లో – సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటా అవార్డ్స్ (ATA Awards) ప్రధానం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగే అన్ని కార్యక్రమాలని ముగించుకుని హైద్రాబాద్‌ (Hyderabad) లోని రవీంద్రభారతి (Ravindra Bharathi) లో జరిగే గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు ఎందరో కళాకారులు.

చివరగా రుచికరమైన విందు భోజనంతో ముగియబోయే ఈ వేడుకలు అమెరికాలో బాల్టిమోర్ (Baltimore, Maryland) నగరంలో జులై 31 – ఆగష్టు 2 జరగబోయే ఆటా మహాసభల (ATA Convention) సన్నాహాల కోసం అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందరికీ ఇదే ఆటా స్వాగతం.

ఆటా (ATA) ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు రెండూ రాష్ట్రాలలో నిర్వహిచటం గమనార్హం. డిసెంబర్ మాసంలో నిర్వహించే ఆటా వేడుకలలో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గోవాలిసిందిగా ఆటా బోర్డ్ విజ్ఞప్తి చేసింది. తమ గ్రామాలూ, పట్టణాలలో సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వారు www.ataworld.org సంప్రదించవలిసిందిగా కోరారు.

error: NRI2NRI.COM copyright content is protected