Connect with us

Associations

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఆటా మహాసభల ఆహ్వానం: భువనేష్ బుజాల

Published

on

అమెరికా, బోస్టన్ నగరం లో పర్యటిస్తున్న తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తో అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అధ్యక్షులు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సోమశేఖర్ నార్ల, కాన్ఫరెన్స్ కోర్ కమిటీ చైర్ హనిమి వేమిరెడ్డి, మల్ల యానాల రీజనల్ డైరెక్టర్, అనిత రెడ్డి, శశికాంత్ పసునూరు, రాజేందర్ కలవ, రమేష్ నల్లవోలు మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది.

ఆటా అధ్యక్షులు భువనేశ్ భుజాల మాట్లాడుతూ ఆటా ఆధ్వర్యంలో అమెరికా మరియు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలు, ఆటా అత్యంత ప్రతిష్టాంతంగా చేపట్టిన కార్యక్రమం ‘నా పాఠశాల – నా బాధ్యత’ భారతదేశంలో పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అమెరికాలో విద్యార్థి యూత్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను వివరించారు. మంత్రి కేటీఆర్ ఆటా నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలకు హర్షం వ్యక్తం చేసి, తెలంగాణ ప్రభుత్వం అండగా వుంటుందని అన్నారు.

ఆటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమెరికా రాజధాని నగరం నడిబొడ్దున వాషింగ్టన్ డి సి లో మూడు రోజులపాటు జూలై 1-3, 2022 జరగనున్న 17వ మహాసభలను నభూతో నభవిష్యతి గా పెద్ద ఎత్తున 10,000 మందికి పైగా హాజరయ్యె విధంగా నిర్వహిస్తున్నాతప్పకుండా రావాలని ఆహ్వానించారు. దీనికి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు.ఈ సమావేశంలో ఐటి ప్రిన్సిపల్ సెక్రెటరి జయేశ్ రంజన్ మరియు వ్యాపారవేత్త కార్తీక్ పొల్సాని పాల్గోన్నారు. ఈ సమావేశాన్ని ఈశ్వర్ బండ ఆటా బోస్టన్ టీం తో కలిసి నిర్వహించటానికి సహకరించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected