Connect with us

Movies

ATA కన్వెన్షన్ కి ఆహ్వానం @ The Family Star సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్, Hyderabad

Published

on

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA అధ్యక్షులు మధు బొమ్మినేని నాయకత్వంలో కిరణ్ పాశం కాన్ఫరెన్స్ కన్వీనర్ గా, శ్రీధర్ తిరుపతి కోఆర్డినేటర్ గా, సాయి సుధిని నేషనల్ కోఆర్డినేటర్ గా, అనీల్ బొద్దిరెడ్డి డైరెక్టర్ గా, ప్రశాంతి అసిరెడ్డి కోకన్వీనర్ గా, ప్రషీల్ గూకంటి కోకోఆర్డినేటర్ గా, శ్రీనివాస్ శ్రీరామ కోడైరెక్టర్ గా 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సంగతి అందరికీ తెలిసిందే.

2024 జూన్ 7 నుంచి 9 వరకు అమెరికాలోని జార్జియా (Georgia) రాష్ట్రం, అట్లాంటా (Atlanta) మహానగరంలో జరగబోయే ఈ ఆటా (American Telugu Association) మహాసభలకు అతిరధమహారథులకు ఆహ్వానం పలికేందుకు ఆటా నాయకులు ఇండియా (India) వెళ్లారు.

ఇందులో భాగంగా పరశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), ప్రముఖ నటులు అజయ్ ఘోష్ తదితరులు నటించిన ది ఫ్యామిలీ స్టార్ తెలుగు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రముఖ యాంకర్ సుమ (Anchor Suma) ఆటా నాయకత్వాన్ని వేదిక మీదకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ATA అధ్యక్షులు మధు బొమ్మినేని (Madhu Bommineni), 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) మరియు డైరెక్టర్ అనీల్ బొద్దిరెడ్డి (Anil Boddireddy) మాట్లాడుతూ ఆటా సేవాకార్యక్రమాలను వివరించారు. ఆటా కన్వెన్షన్ లో పాల్గొనవలసిందిగా సభాముఖంగా కోరారు. అలాగే ది ఫ్యామిలీ స్టార్ యూనిట్ మొత్తానికి సినిమా సూపర్ హిట్ కావాలని శుభాకాంక్షలు తెలిపారు.

18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ (18th ATA Convention & Youth Conference) కల్చరల్ ఛైర్ నీలిమ గడ్డమణుగు (Neelima Gaddamanugu), కోడైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ (Srinivas Srirama) మరియు పొలిటికల్ ఛైర్ రమణ బత్తుల (Ramana Battula) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ది ఫ్యామిలీ స్టార్ సినిమా టీం (The Family Star Movie Team) తో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా కనిపించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఆటా అసోసియేట్ స్పాన్సర్ గా వ్యవహరించడం విశేషం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected