Connect with us

Convention

డాలస్ లో ఆకట్టుకున్న ‘ఆటా’ సయ్యంది పాదం డాన్స్ పోటీలు

Published

on

జులై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ డి.సి లో జరుగనున్న 17వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఆటా డాలస్ కార్యవర్గ బృందం జూన్ 12న డాలస్ నగరం, ఫార్మర్స్ బ్రాంచ్ సెయింట్ మేరీ మాలంకార చర్చ్ ఆడిటోరియం లో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను విజయవంతంగా నిర్వహించింది.

కూచిపూడి , భరతనా ట్యం, జానపదం, టాలీవుడ్ సినిమా నృత్య విభాగాలలో చాలా నాణ్యమైన ప్రదర్శనలతో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.ఈ పోటీలను తిలకించేఅందుకు స్థానికులు పెద్ద మొత్తములో హాజరు అయ్యారు. న్యాయనిర్ణేతలుగా శ్రీమతి సంధ్య గవ్వ, శ్రీమతి సింధూజ , శ్రీమతి స్వప్న గుడిమెళ్ళ వ్యవహరించారు.

ఈ కార్యక్రమానికి ఆటా కార్యవర్గ బృందం అడ్వైసర్ సంధ్య గవ్వ, బోర్డు అఫ్ ట్రస్టీస్ అరవింద్ రెడ్డి ముప్పిడి, శారద సింగిరెడ్డి, స్పిరిచువల్ చైర్ మంజు ముప్పిడి, రీజినల్ కోఆర్డినేటర్ సుమన సారెడ్డి, ఎథిక్స్ కో చైర్ దామోదర్ ఆకుల హాజరు అయ్యారు. ప్రవీణ అంబటి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రోగ్రాం ని విజయవంతం చేసారు. ఈ పోటీలలో గెలిచిన రాష్ట్ర స్థాయి విజేతలు, వాషింగ్టన్ డిసి లో జరుగునున్న కన్వెన్షన్ లో ఫైనల్స్ లో పోటీపడతారు. ఫైనల్స్ కు శేఖర్ మాస్టర్ న్యాయ నిర్ణేతగా రావడం విశేషం.

డాలస్ విజేతల వివరాలు:-
సీనియర్ క్లాసికల్ సోలో: జాహ్నవి యడ్లపాటి మరియు లక్ష్మి శ్రీ హరిత
సీనియర్ క్లాసికల్ గ్రూప్: రమ్యప్రియ రవినుతుల, మోలీ గోయెల్
జూనియర్ క్లాసికల్ సోలో: శ్రీజ డేగ మరియు ఆద్య వాసమసెట్టి
సీనియర్ నాన్-క్లాసికల్ సోలో: ఐశ్వర్య భాగ్యనగర్
సీనియర్ నాన్-క్లాసికల్ గ్రూప్: అనిత ముప్పిడి వేమిరెడ్డి, ప్రీతి మెండు
జూనియర్ నాన్-క్లాసికల్ సోలో: అక్షయ ఓబిలిశెట్టి
జూనియర్ నాన్-క్లాసికల్ గ్రూప్: నిష్క జంగిడి, తాస్వి గాబ్రి, క్రిష ఆనంద్
తదనంతరం ఆటా బోర్డు అఫ్ ట్రస్టీ శారద సింగిరెడ్డి న్యాయనిర్ణేతలకు, కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్స్ అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు.

కాన్ఫరెన్స్ వివరాలు:-
అమెరికా తెలుగు సంఘం(ఆటా) 17వ మహాసభలు అందరి తెలుగు వారి పండుగ కావున అమెరికా రాజధాని నగరం నడిబొడ్డున వాషింగ్టన్ డి సి లో మూడు రోజుల పాటు మహాసభలకు 15,000 పైగా హాజరయ్యే విధంగా న భూతో న భవిష్యతి లాగా నిర్వహించటానికి పద్మవిభూషణ్ సద్గురు, పద్మవిభూషణ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, కమలేష్ D.పటేల్, డిజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీలీల, సంగీత దర్శకుడు తమన్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, GMR, ఉపాసన కొణిదెల,ప్రముఖ కవులు, కళాకారులు,సినీ ప్రముఖులు, మరియు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు విచ్చేస్తున్న ఈ మహాసభలకు అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో విజయవంతం చేసుకుందాము.
Visit www.ataconference.org/buy-tickets

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected