అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సంక్రాంతి సంబరాలు జనవరి 14న ఆటా విస్కాన్సిన్ (Wisconsin), మిల్వాకి (Milwaukee) నగరంలో నిర్వహించారు. ఈ వేడుకలో దాదాపు 300 మందికి పైగా పాల్గొన్నారు. ఈ వేడుకను మన ఊరి లోని సంక్రాంతి పండగను ఎలా జరుపుకుంటామో, అలాగే వేదికని మన ఆట విస్కాన్షిన్ మహిళా సభ్యులు జీవిత నారాయణస్వామి, పావని గంట, శ్రావణి M, లోహిమ మేడం, ఉమా పువ్వాడి చాలా బాగా డిజైన్ చేశారు.
ఈ వేడుకకి వచ్చిన పెద్దలతో, పుర ప్రముఖులతో జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించబడినది. వాసవి బాదం సహకారంతో వేద పండితులు భోగి పళ్ళ మంత్రాలు చదువుతూ వచ్చిన పిల్లలందరికీ భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. ఈ వేడుకలో లోహిమ మేడం, మహిళలకు ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మలు, పిల్లలకి గాలిపటం డిజైన్ పోటీలు నిర్వహించినది.
పిల్లల భరతనాట్యం తో ప్రారంభమైన ఈ పండుగ, జగదీష్ బాదం, చండీ చింతలపాటి పర్యవేక్షణలో పిల్లలందరూ కలిసి మన సంక్రాంతి పండగ ప్రత్యేకతను ఒక నాటకం లాగా చేశారు. రంజిత్ ఎర్రబెల్లి, శ్వేత కుర్ని పిల్లల చేత గేమ్స్ ఆడించారు. కావ్య బండ, మోహన్ బాబు పర్యవేక్షణలో సంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడినది.
ఆ తర్వాత పిల్లలు మరియు పెద్దలు వెస్టన్ డాన్స్ లో పాల్గొన్నారు. భార్యాభర్తలు రాంప్ వాక్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తరపున బహుమతులు అందజేయపడ్డాయి. ఈ వేడుకకు రుచికరమైన వంటకాలు మన ఆటా సభ్యులు అందరూ కలిసి వండారు.
ఈ వేడుకలో లోకల్ ఆర్గనైజేషన్స్ అందరూ పాల్గొని జయప్రదం చేశారు. డాక్టర్ హరిప్రసాద్ గారు, సాయి యార్లగడ్డ గారు ఫ్రమ్ సమ భావన ఫౌండేషన్ మరియు డాక్టర్ రామ గారు ఫ్రమ్ TAGM – తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ మిల్వాకీ మరియు రామకృష్ణ రెడ్డి ఊట్కూరు ఫ్రమ్ MITA – మిల్వాకి తెలంగాణ అసోసియేషన్, ఆనంద్ అడవి గారు ఫ్రం HTW – హిందూ టెంపుల్ ఆఫ్ విస్కాన్సిన్ పాల్గొన్నారు.
భోగి మంటలు వేసి సహాయపడిన వెంకట్ రెడ్డి జలారి, శరత్ పువ్వాడి, గోపాల్ నారాయణస్వామి, కరుణాకర్ రెడ్డి దాసరి. భోజనం ఏర్పాట్లకు సహకరించిన చంద్రశేఖర్ తంగెళ్ల, ఫొటోస్ అండ్ వీడియోస్ చిత్రీకరించిన జయంత్ పార లకు కృతఙ్ఞతలు తెలియజేశారు.
అలాగే ఈ పండుగ కార్యక్రమాలకి సహకారం అందించిన మన ఆటా మిత్రబృందం దుర్గాప్రసాద్ రబ్బా, ఫణి గరపాటి, గంగాధర్, మహేష్ బేల, రత్నాకర్ రెడ్డి గద్వాల్, అవినాష్ రెడ్డి కుందూరు, విక్రాంత్ రెడ్డి కుందూరు, రోజా మర్రి, ఉత్కర్ష రెడ్డి, సునీత ఎర్రబెల్లి, వివేకానంద కొమ్మినేని, అర్జున్ సత్యవరపు, సురేష్ బెస్తి, రాజబాబు నేతి, సింధు నేతి మరియు న్యూ బర్లిన్ యునైటెడ్ వాలీబాల్ గ్రూప్ మెంబర్స్ అందరికీ చంద్రమౌళి మరియు పోలిరెడ్డి గారు పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
ఆటా జనరల్ సెక్రటరీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association – ATA) మెంబర్షిప్ బెనిఫిట్స్ మరియు ఈ సంవత్సరం జూన్ 7th to 9th అట్లాంటా (Atlanta) లో జరగనున్న, ఆటా 18వ కన్వెన్షన్ (Convention) కి అందర్నీ ఆహ్వానించారు.
ఈ సంక్రాంతి సంబరాలు జయప్రదం కావటానికి సహకరించిన ఆటా విస్కాన్సిన్ మెంబర్స్ మరియు నాన్ మెంబర్స్ కి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన పోలిరెడ్డి గంట మరియు చంద్రమౌళి సరస్వతి గారు మాట్లాడుతూ.. ఇలాంటి పండుగలు మరియు ఆటా సోషల్ ఈవెంట్స్ జరపటానికి ప్రోత్సహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మధు బొమ్మినేని గారికి మరియు ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.