Connect with us

Literary

ఆటా మహాసభల పోటీలో గెలుపొందిన నవలకు కేంద్ర పురస్కారం, హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ప్రదర్శన

Published

on

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ గత 17వ మహాసభల సమయంలో నవలల పోటీ నిర్వహించిన సంగతి అందరికీ విదితమే. ఆ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆ నవలా పోటీలలో బహుమతి పొందిన నవల ‘మనోధర్మపరాగం’ కి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించారు. ఈ సందర్భంగా మనోధర్మపరాగం నవలా రచయిత మధురాంతకం నరేంద్ర కి ఆటా లీడర్షిప్ ఆత్మీయ అభినందనలు తెలిపింది.

అప్పట్లో ఆ నవలా పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన పి.సత్యవతి, పూడూరి రాజిరెడ్డి, సాయి బ్రహ్మానందం గొర్తి, శివకుమార శర్మ లకు మరోసారి ఆటా లీడర్షిప్ ధన్యవాదాలు తెలిపింది. అమెరికా తెలుగు సంఘం, అన్వీక్షికి సంయుక్తంగా ప్రచురించిన ఈ నవలని అన్వీక్షికి, నవోదయ, లేదా అమెజాన్ ద్వారా పొందవచ్చు.

ఈ నవలలు 2022 డిసెంబర్ 22 నుండి 2023 జనవరి 1 వరకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తున్న 35వ జాతీయ పుస్తక మహోత్సవంలో ప్రదర్శించనున్నారు. తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో 124 మరియు 159 స్టాల్ల్స్ లో ఆటా నవలా పోటీలలో బహుమతి పొందిన నవలలు అందుబాటులో సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected