ఆటా చేస్తున్న సేవలు అనిర్వచనీయమని మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా (Rangareddy District), జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Challa Linga Reddy Zilla Parishad High School) లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆటా (ATA) ప్రెసిడెంట్ జయంత్ చల్లా దంపతుల ఆర్థిక నిధులతో స్కాలర్షిప్ ల పంపిణీ, స్కూల్ సాంస్కృతిక కార్యక్రమానికి మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి, టియుఎఫ్ఐడీసీ కార్పొరేషన్ చైర్మెన్ చల్ల నరసింహ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా (American Telugu Association – ATA) ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి ఇతర ప్రతినిధులు హాజరవ్వగా, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) మాట్లాడుతూ… జిల్లెల్లగూడ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్ లు అందించిన ఆటా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్న ఆటా ఈ ప్రాంత ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది అన్నారు. టియుఎఫ్ఐడీసీ కార్పొరేషన్ చైర్మెన్ చల్ల నరసింహ రెడ్డి మాట్లాడుతూ, ఆటా సేవలు అనిర్వచనీయమని అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధిలో పాలుపంచుకున్న ఆటా కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa) దంపతులను అభినందించారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన ఆటా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa) మాట్లాడుతూ… గత 33 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇదే సందర్భంలో తనను కన్న ఈ ప్రాంతానికి తోచినంత చేయాలనే ఉద్దేశ్యంతో మా నాన్న గారి ఆశయాలకు అనుగుణంగా ఈ స్కాలర్షిప్ లను పంపిణీ చేశామన్నారు.
ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి (Satish Reddy) మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలకు అన్ని విధాలుగా ఆటా సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపి అభినందించారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించడమే ఆటా లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు, కో చైర్ నరసింహ ద్యాసాని, సాయి సూదిని (Sai Sudhini), ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల (Sridhar Banala), బోర్డు ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి (Parmesh Bheemreddy), బిజినెస్ చైర్ హరీష్ బత్తిని, రామకృష్ణారెడ్డి అల, నర్సి రెడ్డి, తిరుమల్ రెడ్డి, రాజ్ కక్కర్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.