Suryapet, Telangana: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలో ఆటా (అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa), ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy) మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆటా (American Telugu Association – ATA) బృందాన్ని అభినందించారు.
ఆటా (American Telugu Association – ATA) చేపడుతున్న సామాజిక సేవలు, ధార్మిక కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి (Satish Reddy) మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా గ్రామాల్లో విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్థామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆటా (American Telugu Association – ATA) చేస్తున్న సేవ కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసమే చేస్తున్నామని చెప్పారు. అంతకముందు గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని (Venkateswara Swamy Temple) సందర్శించి దర్శించుకున్నారు.
ఈ వైద్య శిబిరంలో (Health Camp) వివిధ విభాగాలకు చెందిన వైద్యులు సేవలందిస్తూ సాధారణ వైద్య పరీక్షలు, రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని (Narasimha Dyasani), సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి (Srikanth Gudipati), క్రీడల సమన్వయకర్త విజయ్ గోలి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది పాల్గొన్నారు.
అలాగే వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం (Vishnu Madhavaram), హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం (Venu Nakshathram), లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.