2022 జులై 1, 2, 3 తేదీలలో జరగనున్న 17వ మహాసభల సందర్భంగా అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ నవలల పోటీ నిర్వహిస్తుంది. నవలలు ఫిబ్రవరి 15, 2022 లోపు అందవలెను. మొత్తం రెండు లక్షల రూపాయల బహుమతులు అందించబడును. మరిన్ని వివరాలకు ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా నవలకు నేపథ్యం కావొచ్చు కానీ అది తెలుగువారి జీవితానికి సంబంధించినదై ఉండాలి. నవల అచ్చులో కనీసం వంద పేజీలయినా ఉండాలి. ప్రపంచంలోని ఎక్కడి వారయినా ఈ పోటీకి నవలలు పంపవచ్చు. తెలుగులో డిటిపి చేసిన కాపీలను లేదా చేతిరాతను స్కాన్ చేసిన కాపీలను ఈమెయిల్ ద్వారా atanovels2022@gmail.com కు పంపాలి. నవలలు తమ స్వంతమనీ, అనువాదాలు, అనుసరణలు కాదనీ, గతంలో ఎక్కడా ప్రచురితం కాలేదని, వేరే పత్రికల వద్ద పరిశీలనలో లేదనీ, ఫలితాలు వచ్చేవరకు ఎక్కడా ప్రచురింపబోమని పేర్కొంటూ రచయితలు హామీ పత్రం జతచేయాలి. నవల ప్రతి మీద రచయిత/రచయిత్రి పేరు ఉండకూడదు. రచయిత/రచయిత్రి పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ ఈమెయిల్ లో విడిగా రాయాలి. నవలల ఎంపికలో తుది నిర్ణయం ఆటా నిర్వాహకులదే. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, వాద ప్రతివాదాలకు తావులేదు. నవలల పోటీ గడువు తేదీ పొడిగించే విషయంలో గానీ, పోటీ రద్దు చేసే విషయంలో గానీ, బహుమతి మొత్తంలో మార్పులు చేసే విషయంలో గానీ నిర్వాహకులకు సర్వహక్కులూ ఉన్నాయి. బహుమతి పొందిన నవలలను ప్రచురించే హక్కు ఆటాకు ఉంటుంది.