Virginia, July 27:
అమెరికన్ తెలుగు అసోషియేషన్ (American Telugu Association – ATA) సాహిత్య విభాగం ఆధ్వర్యంలో వాషింగ్టన్ డి.సి మెట్రో (Washington DC Metro) ప్రాంతంలోని సాహిత్యాభిమానుల కోసం నిర్వహించిన ఆటా సాహిత్య సభ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
సాహిత్యాన్ని ప్రేమించే ఎన్నోమందిని ఆకట్టుకున్న ఈ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (American Telugu Association – ATA) సభలో ప్రముఖ కవులు, రచయితలు, పాఠకులు, మరియు ప్రవాస తెలుగు సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రముఖ కవి, అవధాని శ్రీ నరాల రామారెడ్డి గారు, రచయిత్రి శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి గారు, శ్రీ మాగులూరి భానుప్రకాష్ గారు ముఖ్య వక్తలుగా పాల్గొని “గురజాడ రచనలు – సామాజిక బాధ్యత”, “సినీ ప్రపంచంలో శ్రీ శ్రీ పాట” వంటి అంశాలపై విలక్షణమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ వేణు నక్షత్రం (Venu Nakshathram) గారు, శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి గారి కథాసంపుటి “పగడాల దీవి” పుస్తక పరిచయం చేశారు. క్రొత్తగా కథలు రాయాలనుకునే వారికి ఈ పుస్తకం ఒక దిక్సూచి లాంటిది అని అభివర్ణించారు.
ఆటా (ATA) సాహిత్య విభాగం సభ్యులు భూపతి విహారి నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని చదివిన కవితలను మూడు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. ఈ పోటీల్లో ప్రధమ బహుమతి శ్రీ చంద్ర చెళ్ళపిళ్ళ గారికి, ద్వితీయ బహుమతి శ్రీమతి సౌజన్య గుడిపాటి గారికి, తృతీయ బహుమతి శ్రీమతి సుశీల సత్యవోలు గారికి లభించింది.
పలు ప్రతిభావంతుల కవితా పఠనాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రతి కవికి వేదిక కల్పిస్తూ, వారి రచనలకు మార్గదర్శకత్వాన్ని అందించింది ఈ సమావేశం. ఆటా (American Telugu Association – ATA) కార్యనిర్వాహక సభ్యులు అందరూ సమర్థవంతంగా సమన్వయం చేశారు.
సాహిత్య విభాగపు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ శ్రీ వేణు నక్షత్రం గారి ఆధ్వర్యంలో, ఆటా అధ్యక్షులు శ్రీ జయంత్ చల్లా (Jayanth Challa) గారి నేత్రుత్వంలో, ఆటా పూర్వ అధ్యక్షులు శ్రీ భువనేశ్ భూజాలా, కార్యనిర్వాహక సభ్యులు శ్రే సుధీర్ భండారు, శ్రీ జీనత్ రెడ్ది మరియు ఇతర ఆటా కార్య నిర్వాహక బృందం సహాయ సహకారాలతో సాహిత్య సమావేశం విజయవంతంగా, ఆహ్లాదకరంగా జరిగింది.
ఇది వాషింగ్టన్ డి.సి. మెట్రో (Washington DC Metro) ప్రాంతంలో కొత్తగా ఎన్నికయిన కార్యనిర్వాహక బృందం మొట్టమొదటి ఆటా సాహిత్య సభ కావడంతో, దీనికి విశేష స్పందన లభించింది. సాహిత్య వేదికగా ATA ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం తెలుగు సాహిత్యాభిమానుల కోసం మరెన్నో అవకాశాలకు ద్వారం తీయనుంది.