Connect with us

News

ఆటా వేడుకలకి ఏర్పాట్లు పూర్తి, తెలంగాణ గవర్నర్ కి ఆహ్వానం @ Hyderabad

Published

on

రేపటి నుండి ప్రారంభం కానున్న అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) ‘ఆటా’ వేడుకలకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. డిసెంబర్ 10 నుండి 30 వరకు ప్రతి రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరోగ్య, విద్య, సాహిత్య, సాంస్కృతిక, వ్యాపార, ఆధ్యాత్మిక, క్రీడా రంగాలకు సంబంధించి పలు కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు.

ఆటా ముఖ్య నాయకులు (ATA Leaders) అందరూ ఇప్పటికే ఇండియా (India) చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆటా ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తెలంగాణ ఛైర్ సి. శేఖర్ రెడ్డి, ఆటా బిజినెస్ చైర్ లాక్స్ చేపూరి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ని కలిసి ఆహ్వానించారు.

ఆటా నాయకులు గౌరవ తెలంగాణ (Telangana) రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ని హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కలిసి సేవాడేస్ గురించి వివరించగా, ఆటా మరియు CII కలిసి హైదరాబాద్ (Hyderabad) లో నిర్వహిస్తున్న బిజినెస్ సెమినార్ కి హాజరవడానికి సుముఖత చూపినట్లు తెలిసింది.

వచ్చే జూన్ 7, 8, 9 లలో అట్లాంటా (Atlanta) మహానగరంలో నిర్వహించబోయే ఆటా కన్వెన్షన్ కి ముందుగా ఈ ఆటా వేడుకల కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించడం ఆనవాయితీ. స్థానికంగా నాన్-ప్రాఫిట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవాకార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected