అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) ‘ఆటా’ 2024 జూన్ 7, 8, 9 తేదీలలో అట్లాంటా (Atlanta) లో నిర్వహిస్తున్న 18వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ కి ప్రముఖ ధ్యాన గురువు, ప్రకృతి ప్రేమికుడు దాజీగా పిలిచే కమలేశ్ డి. పటేల్ (Kamlesh Patel, Daaji) ను ఆహ్వానించారు.
ఆటా (ATA) కన్వెన్షన్ లో పాల్గొనేందుకు ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినీ నటులు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. నిన్న ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని (Madhu Bommineni), కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) తదితరులు కన్హాశాంతి వనంలో కలిసి దాజీ ని ఆహ్వానించారు.
ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చని చెప్పే దాజీ హైదరాబాద్ (Hyderabad) కు సమీపంలో నందిగామ మండలంలో సుమారు 1,400 ఎకరాల్లో కన్హాశాంతి వనం పేరుతో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ గా పేరుపొందింది.
ఇక్కడ ఒకేసారి లక్ష మంది కూర్చుని ఏకాంతంగా ధ్యానం (Meditation) చేసే అవకాశం ఉంది. 160 దేశాలకు చెందిన సుమారు ఐదువేల మంది అభ్యాసికులు ఉన్నారు. ధ్యాన గురువుగా దాజీ (Kamlesh Patel) చేస్తున్న సేవలకు ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నారు.
ఆయన ఇటీవలనే భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత అవార్డు పద్మభూషణ్ ను కూడా అందుకున్నారు. శ్రీరామచంద్రమిషన్, హార్ట్ ఫుల్ నెస్ ఇన్‌స్టిట్యూట్, హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (Heartfulness Education Trust) వంటి వాటిని కూడా ఆయన ఏర్పాటు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు (ATA Vedukalu) నిర్వహిస్తున్న ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని (Madhu Bommineni), ఆటా ఉపాధ్యక్షులు & వేడుకల ఛైర్ జయంత్ చల్లా (Jayanth Challa), కో-ఛైర్ వేణు సంకినేని, కార్యదర్శి రామకృష్ణారెడ్డి అల, కోశాధికారి సతీష్ రెడ్డి కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) తదితరులు ఈ ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్నారు.