Connect with us

News

ATA Convention: CM రేవంత్ రెడ్డి, బాలక్రిష్ణ, దాజీ, మంత్రులు, గాయకులకు సాదర ఆహ్వానం

Published

on

2024 జూన్ 7 నుంచి 9 వరకు అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta) మహానగరంలో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ (18th ATA Convention & Youth Conference) నిర్వహణకు పలు కమిటీలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఆటా (American Telugu Association) మహాసభలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ఆటా నాయకులు ఇండియా (India) వెళ్లారు. ఇందులో భాగంగా పలువురు హేమాహేమీలను కలిసి పర్సనల్ గా ఆహ్వానం అందించారు.

ఆహ్వానం అందుకున్న ప్రముఖులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనుముల (Revanth Reddy Anumula), టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బొనాంజా నందమూరి బాలక్రిష్ణ (Nandamuri Balakrishna), ధ్యాన గురువు పద్మభూషణ్‌ దాజీ కమలేష్ పటేల్ (Kamlesh Patel), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హీరో శ్రీకాంత్, సింగర్ మంగ్లి తదితరులు ఉన్నారు. దాజీతో ప్రత్యేకంగా డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) అధ్యక్షులు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, అడ్వైజర్ గౌతం గోలి, డైరెక్టర్ అనీల్ బొద్దిరెడ్డి, ఆటా నాయకులు సన్నీరెడ్డి, కల్చరల్ ఛైర్ నీలిమ గడ్డమణుగు, కోడైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ మరియు పొలిటికల్ ఛైర్ రమణ బత్తుల తదితరులు కలిసి ఆహ్వానాలు అందిస్తున్నారు.

సెలబ్రిటీ ఆహ్వానితులు అందరూ ఆటా నాయకులను సాదరంగా కలవడమే కాకుండా, ఇటు అమెరికాలో అటు ఇండియాలో ఆటా (American Telugu Association) చేస్తున్న సేవాకార్యక్రమాలను అభినందించడం ముదావహం. ఆటా నాయకులు ఈ వారాంతం వరకు మరికొంతమంది ప్రముఖులను ఆహ్వానించి తిరుగు ప్రయాణం సాగిస్తారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected