12 ఏళ్ళ తర్వాత ముచ్చటగా మూడోసారి అట్లాంటా (Atlanta) లో అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ కన్వెన్షన్ నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆటా 18వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ వచ్చే సంవత్సరం 2024 జూన్ 7, 8, 9 తేదీలలో జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ (Georgia World Congress Center) లో నిర్వహించనున్నారు.
ఆటా చరిత్రలో రెండవ మహిళా అధ్యక్షురాలు మధు బొమ్మినేని (Madhu Bommineni) అధ్యక్షతన, కిరణ్ పాశం (Kiran Reddy Pasham) కాన్ఫరెన్స్ కన్వీనర్ గా, సాయి సుధిని నేషనల్ కోఆర్డినేటర్ గా, శ్రీధర్ తిరుపతి కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ గా మరియు అనీల్ బొద్దిరెడ్డి కాన్ఫరెన్స్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.
ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్న ఆటా (American Telugu Association) నాయకులు గడిచిన సెప్టెంబరు 8న బోర్డు సమావేశం అనంతరం కన్వెన్షన్ లోగో మరియు పాట విడుదల చేశారు. అలాగే డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 30 వరకు ఇండియా (India) లో ఆటా వేడుకలు నిర్వహించన్నారు.
మొత్తంగా ఆటా 18వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ (Conference & Youth Convention) లో భాగంగా ఇప్పుడు డిసెంబర్ 2 శనివారం రోజున కిక్ ఆఫ్ & ఫండ్రైజర్ కార్యక్రమం అట్లాంటాలో నిర్వహిస్తున్నారు. డులూత్ (Duluth) లోని జేడ్ బాంక్వెట్స్ ఈ కార్యక్రమానికి వేదిక. రిజిస్ట్రేషన్ కొరకు www.NRI2NRI.com/ATA 18th Convention Fundraiser in Atlanta ని సందర్శించండి.
ఈ కిక్ ఆఫ్ & ఫండ్రైజర్ కార్యక్రమంలో కన్వెన్షన్ కమిటీల (Convention Committees) పరిచయం, సాంస్కృతిక కార్యక్రమాలు, సింగింగ్, ఫ్యాషన్ షో వంటి ప్రోగ్రామ్స్ ఆకట్టుకోనున్నాయి. అలాగే ప్రముఖ మిమిక్రి కళాకారుడు రమేష్ (Mimicry Ramesh) అందరినీ అలరించనున్నారు.