అమెరికా తెలుగు సంఘం ATA అధ్యక్షులు మధు బొమ్మినేని మరియు కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) నాయకత్వంలో శ్రీధర్ తిరుపతి కోఆర్డినేటర్ గా, ప్రశాంతి అసిరెడ్డి కోకన్వీనర్ గా, సాయి సుధిని నేషనల్ కోఆర్డినేటర్ గా, అనీల్ బొద్దిరెడ్డి డైరెక్టర్ గా, ప్రషీల్ గూకంటి కోకోఆర్డినేటర్ గా, శ్రీనివాస్ శ్రీరామ కోడైరెక్టర్ గా 2024 జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటా (Atlanta) మహానగరంలో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పటికే పలు నగరాలలో విజయవంతంగా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్రైజింగ్ ఈవెంట్స్ (Convention Kickoff & Fundraising Events) నిర్వహించారు. ఇందులో భాగంగా గత వారాంతం మార్చి 10 ఆదివారం రోజున న్యూజెర్సీ లో ముందుగా బిజినెస్ సెమినార్, అనంతరం నిధుల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) న్యూ జెర్సీ మరియు న్యూయార్క్ టీం – కార్పొరేట్ చైర్ హరీష్ బథిని, కో చైర్ ప్రదీప్ కట్టా మరియు ఫైనాన్స్ కమిటీ చైర్ శ్రీకాంత్ గుడిపాటి మరియు కో చైర్ శ్రీకాంత్ తుమ్మలతో పాటు రీజినల్ కోరినేటర్లు సంతోష్ కోరం మరియు ధనరాజ్, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల మరియు మహిళల రీజినల్ కోఆర్డినేటర్ గీతా గంగుల ఈ కార్యక్రమానికి సహాయం చేశారు.
న్యూ జెర్సీ మరియు న్యూయార్క్ ధర్మకర్తలు శరత్ వేముల, రఘువీరారెడ్డి, పరశురాం పిన్నపురెడ్డి, శ్రీనివాస్ దార్గుల, వినోద్ కోడూరు, శ్రీకాంత్ గుడిపాటి, రవీందర్ గూడూరు మరియు మాజీ అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి, సుధాకర్ పెరికరి మరియు రాజిందర్ జిన్నా, మరియు సలహాదారులు న్యూ జెర్సీ (New Jersey) నుండి హాజరైన ధర్మకర్తల మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA నాయకత్వ బృందం విజయ్ కుందూర్, ప్రవీణ్ అలా, రాజ్ చిలుముల అట్లాంటాలో జరగనున్న ఆటా (ATA) కాన్ఫరెన్స్ కోసం 175 కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ ప్లెడ్జెస్ తో $636K ప్లస్ సేకరించగలిగారు. మొత్తంగా న్యూజెర్సీ మరియు న్యూయార్క్ (New York) బృందం అట్లాంటా కాన్ఫరెన్స్ కోసం $800K పైగా ప్లెడ్జెస్ సేకరించింది.
ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని (Madhu Bommineni)గారు, ప్రెసిడెంట్ఎలెక్ట్ జయంత్ చల్లా (Jayanth Challa) గారు మరియు పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి (Karunakar Asireddy) గారు, ఫిలడెల్ఫియా ట్రస్టీ రాజ్ కక్కెర్ల గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే దాతృత్వానికి దాతలందరికీ ధన్యవాదాలుతెలియజేశారు.