Connect with us

Schools

ATA Seva Days: ప్రభుత్వ పాఠశాలకు ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, ప్రహరీ గోడ ఏర్పాటు; తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీదేవి హాజరు

Published

on

. ఆటా (ATA) సహకారంతో తిమ్మాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రహరీ గోడ, ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభం
. విద్యార్థులకు షూ, టిఫిన్ బాక్సులు, బ్యాగ్స్ తదితర సామాగ్రి పంపిణీ
. బోర్డు ఆఫ్ ట్రస్టీ విష్ణు ప్రకాష్ రావు మాధవరం స్వంత నిధులతో నిర్వహణ
. హాజరైన తెలంగాణ హై కోర్టు జస్టిస్ (High Court Justice) శ్రీదేవి, ఎమ్మెల్యే డా. సంజయ్, ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, అడిషనల్ కలెక్టర్ తదితరులు

తెలుగు రాష్ట్రాల్లో ఆటా (ATA) చేస్తున్న సేవలు అభినందనీయం అని తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీదేవి (Juvvadi Sridevi) అన్నారు. జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) సహకారంతో, ఆ సంస్థ బోర్డు ఆఫ్ ట్రస్టీ విష్ణు ప్రకాష్ రావు మాధవరం స్వంత నిధులతో నిర్మించిన ప్రహరీ గోడ, విద్యార్థులకు తాగడానికి ఆర్వో వాటర్ ప్లాంట్ (RO Water Plant) ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన చేశారు.

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులు షూల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar), ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, డిఇఓ రాము తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడుతూ… సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఆటా కార్యవర్గ కమిటీకి అభినందనలు తెలిపారు.

ఆటా (ATA) ఈ రోజు చేసిన కార్యక్రమాలు అన్ని కూడా విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని అన్నారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు (NRI) మాతృభూమిపై ప్రేమతో గ్రామీణ విద్యాభివృద్ధికి సహకరించడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) మౌలిక సదుపాయాల కల్పనకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగేలా చేస్తాయని అన్నారు.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యుడు విష్ణు మాధవరం (Vishnu Madhavaram) స్వంత నిధులతో ఈ అభివృద్ధి పనులను చేపట్టడం అభినందనీయమనన్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి స్వంత నిధులతో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించినట్లు అవుతుందన్నారు.

ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa), ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి (Satish Reddy) మాట్లాడుతూ… ఆటా సేవ కార్యక్రమాలల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ప్రాంత బిడ్డ విష్ణు మాధవరం మా టీం లో ఉండటం మాకు గర్వంగా ఉందన్నారు.

కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాఠశాల భద్రత మెరుగు పడుతుందని, ఆర్‌ఓ ప్లాంట్ (RO Water Plant) ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగవుతుందని, అలాగే విద్యార్థులకు పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులు, షూస్ వారి రోజువారీ అవసరాలను తీరుస్తాయని, పేద కుటుంబాల పిల్లలకు ఇది పెద్ద తోడ్పాటని అన్నారు.

అడిషనల్ కలెక్టర్ (Collector) రాజాగౌడ్, డిఇఓ రాము మాట్లాడుతూ, ఆటా (American Telugu Association – ATA) సంస్థకు, ముఖ్యంగా విష్ణు మాధవరంకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సీతా లక్ష్మి, తిమ్మాపూర్ సర్పంచ్ పుష్పలత వైకుంఠం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని (Sai Sudhini), ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా (Ramakrishna Reddy Ala), సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది పాల్గొన్నారు.

అలాగే వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం (Venu Nakshathram), లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా (Eshwar Banda), ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ కృష్ణారావు తదితరులు కూడా పాల్గొని విజయవంతం చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected