Connect with us

Associations

ఆటా కన్వెన్షన్ అట్లాంటాలో, అమెరికా తెలంగాణ సంఘం విలీనం, విజయవంతంగా బోర్డ్ మీటింగ్ @ Dallas, Texas

Published

on

ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని అధ్యక్షతన అమెరికా తెలుగు సంఘం (ఆటా) శనివారం మే 6, 2023 న డాలస్,టెక్సా స్, అమెరికాలో బోర్డు సమావేశం నిర్వహించారు. ఉత్తరాధ్యక్షులు జయంత్ చల్లా, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, పాలకమండలి బృందసభ్యు ల ఆధ్వర్యంలో ఎనిమిది గంటల పాటు నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు.

వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న రీజనల్ అడ్వయిసర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వయిసర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. ఆటా సంస్థ అధ్యక్షురాలు మధు బొమ్మినేని 2023 సంవత్సరములో జనవరి నుండి ఏప్రిల్ వరకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.

ముందుగా వివిధ నగరాలలో ముమ్మరంగా జరిపిన పద్దెనిమిది మహిళా దినోత్సవ వేడుకల గురించి మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో జరగడము ఇదే మొదటిసారి అని వ్యక్తం చేసారు. అలాగే ఇమిగ్రేషన్ వెబినార్,హోలి, ఇల్లు లేని వారికి ఆహర సరఫరా సేవా, మహిళలకు రంగోలి, వంటల పోటీలు, మహిళల క్రికెట్, త్రోబాల్ క్రీడా కార్యక్రమాలు, ఆటా డే ఉత్సవాలు చేసిన ఆటా కార్యవర్గ బృందానిని కొనియాడారు.

వారికున్న ఉత్సాహానికి, సేవానిరతికి కృతజ్ఞతతో అంజలి ఘటించారు. ప్రతీ వారము ఆటా కొనసాగిస్తున్న యోగా కార్యక్రమములో పాల్గొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవలసిందిగా అమెరికా వాసులందరికి పిలుపునిచ్చా రు. సంస్థ అందచేస్తున్న టెక్నా లజి, ఉన్నత విద్యా భివృద్దికి సంబందించిన సేల్స్ ఫోర్స్ మరియు సాట్ శిక్షణల గురించి, అమెరికాభారతి ఆటా 2023 మొదటి త్రైమాసిక పత్రిక ఏప్రిల్ 1 న విడుదల చేసామని, ద్వితీయ త్రైమాసిక పత్రిక కవర్ పేజి కోసం యువత కి ‘ఆర్ట్ పోటీ’ నిర్వహిస్తున్నాము అని తెలియచేసారు.

హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సభ్యు లు గతసంవత్సరం ఆటా సంబరాలకు పెద్ద మొత్తములో దాతగా నిలబడి, మెడిటేషన్ గురించి అమెరికా వాసులకి అంతర్జాలములో శిక్షణను కలిగించినందుకు అభినందిస్తూ కృతజ్ఞతా పూర్వకంగా దాతలుగా నిలిచిన ఆటా పూర్వధ్యక్షులకు, పాలకమండలి సభ్యు లకు ధన్యవాదాలు తెలియపరిచారు.

ఆటా సంస్థ సేవా కార్యక్రమాలు అమెరికాలోనే కాకుండా ‘టర్కీ యెర్త్ క్వేక్’ కి ధనసహాయం రెడ్ క్రాస్ సంస్థ తో సమన్వయంగా చేయడం, అలాగే తెలంగాణ గ్రామీణ మహిళల కోసం ‘యెనేమియా అవేర్నెస్’ ప్రోగ్రాం ద్వా రా విటమిన్స్ అందచేయడానికితగిన నిధులు జమచేసి పంపడం జరుగుతుంది అని, నిరంతరంగా సేవా సహాయ, కార్యక్రమాలలో సంస్థ కార్యవర్గం ముందంజలో ఉంటుంది అని పేర్కొ న్నా రు.

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకి ఎమర్జెన్సీ పరిస్థితులలో సేవలను అందిస్తున్న ఆటా సేవా-టీం కార్యవర్గాన్ని కొనియాడారు. ఆటాలో అత్యధికంగా కొత్త సభ్యు లని చేర్చిన వారికి ‘మోస్ట్ వాల్యు బుల్ పర్సన్ ఆఫ్ ది మంత్’ గా మార్చ్ మాసం రాలీ నుండి శృతి చామల గడ్దం, ఏప్రిల్ మాసం సాండియేగో నుండి కాశప్ప మదారం లకు గుర్తింపుని ఇచ్చారు.

అలాగే ఫస్ట్ క్వా ర్టర్ లో మంచి కార్యక్రమాలను పెద్దమొత్తంలో చేస్తున్న జాబితాలో ‘మోస్ట్ వాల్యు బుల్ సిటీ ఆఫ్ ది మంత్’ గా ఫీనిక్స్ నగరాన్ని గుర్తించి సంస్థ అభినందించింది అని సమావేశములో తెలియపరుస్తూ, అధిక సంఖ్యలో సంస్థలో సభ్యు లను చేర్చడానికి, వినూత్నంగా భాష, సంగీత, సాహిత్య, నృత్య కార్యక్రమాలను, మరెన్నో సహాయ కార్యక్రమాలను చేయాలని కార్యవర్గ బృందాన్ని ప్రోత్సహించారు.

అట్లాంటాలో ‘అమెరికా తెలుగు సంఘం (ఆటా) 18 వ కన్వెన్షన్ & యూత్ కాన్ ఫరెన్స్ జార్జియా వర్ల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో జరపడానికి పాలకమండలి సభ్యు లు నిర్ణయించారు. అమెరికా తెలంగాణ సంఘం, అమెరికా తెలుగు సంఘం (ATA) లో ఐక్యమవ్వా లనే ప్రతిపాదనని పాలకమండలి సభ్యు లు ఆమోదించారు. కలిసి పని చేసే ప్రాతిపదిక పై కమిటీని నిర్ణయించారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆటా ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న మీడియా మిత్రులందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected