Connect with us

Health

Nagarkurnool, Telangana: మహిళల ఆరోగ్యంపై ATA సదస్సు & ఉచిత వైద్య శిబిరం, పాల్గొన్న కలెక్టర్ & ఎమ్మెల్యే

Published

on

Nagarkurnool, Telangana: నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో కేజీబీవి పాఠశాలలో మహిళల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో అమెరికా తెలుగు సంఘం (ఆటా), మానవత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళ ఆరోగ్య అవగాహన సదస్సు & ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్, ఎమ్మెల్యే కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా, ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa), ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మహిళల ఆరోగ్యం కుటుంబం, సమాజం, రాష్ట్ర అభివృద్ధికి పునాది అని వారు స్పష్టం చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్ (District Collector Santosh Badavath) మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రక్తహీనత, మధుమేహం, రక్తపోటు, గర్భాశయ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి (Kuchukulla Rajesh Reddy) మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ శిబిరాల ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ఆరోగ్యమే అసలైన సంపద అని పేర్కొంటూ, మహిళలు (Women) శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు (Awareness Session) తరచుగా నిర్వహించేందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

అంతకముందు ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి (Satish Ramasahayam Reddy) లు మాట్లాడుతూ, మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఆటా సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలోని వైద్య నిపుణుల సహకారంతో ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ శిబిరంలో అనేక విభాగాల వైద్య నిపుణులు మహిళలకు (Women) ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు గైనకాలజీ (Gynecology) సంబంధిత సలహాలు అందించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఉపన్యాసాలు, సందేహ నివృత్తి కార్యక్రమాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లయ్య, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, క్రీడల సమన్వయకర్త విజయ్ గోలి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా (Ramakrishna Reddy Ala), సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం (Vishnu Madhavaram), హరీష్ బత్తిని (Harish Bathini), సుమ ముప్పాల, వేణు నక్షత్రం పాల్గొన్నారు.

అలాగే లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా (Eshwar Banda), మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, జిల్లా వైద్యాధికారి (Medical Officer) రవి నాయక్, కేజీబీవీ పర్యవేక్షణ అధికారిని శోభారాణి, తాడూరు మండల విద్యాధికారి త్యాగరాజు గౌడ్, కేజీబీవీ ప్రత్యేక అధికారిని విజయ, ఉపాధ్యాయులు విద్యార్థినిలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected